తెలుగులో పెద్దగా హిట్లు లేకపోయినా మంచి గుర్తింపు కలిగిన నటి నా కెరీర్ను కొనసాగిస్తున్న వారిలో నబా నటేష్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ సుధీర్ బాబు హీరోగా రూపొందిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత ఈ బ్యూటీ రవితేజ హీరోగా రూపొందిన డిస్కో రాజా సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ బ్యూటీ కి నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత ఈమె రామ్ పోతినేని హీరోగా రూపొందిన ఈస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్గా నటించింది.

మూవీ మంచి విజయం అందుకుంది. ఈ మూవీ తో ఈమెకు మంచి క్రేజ్ తెలుగు లో దక్కింది. ఆ తర్వాత ఈమె అల్లుడు అదుర్స్ మరికొన్ని సినిమాలలో నటించింది. ఆ సినిమా కూడా ఈమెకు ఏమి గుర్తింపును తెచ్చి పెట్టలేదు. అలాగే ఈస్మార్ట్ శంకర్ మూవీ తర్వాత ఈమె నటించిన సినిమాలు ఏవి కూడా పెద్ద స్థాయి విజయాలను అందుకోలేదు. ఇక కొంత కాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె మళ్లీ వరుస సినిమాలలో నటిస్తోంది. అందులో భాగంగా ఈమె ప్రియదర్శి హీరోగా రూపొందిన డార్లింగ్ అనే సినిమాలో నటించింది.

మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. ప్రస్తుతం ఈమె నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభు అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఒక హిట్ తోనే కెరియర్ను మంచి జోష్ లో ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ కి ప్రస్తుతం నటిస్తున్న రెండు సినిమాలు కూడా విజయాలను సాధించినట్లు అయితే మరిన్ని క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కే ఛాన్స్ చాలా వరకు ఉంది. మరి డార్లింగ్ , స్వయంభు సినిమాలతో ఈమె ఏ స్థాయి విజయాలను అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

nn