సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలు రావడం కోసం అనేక మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంత మంది మోడలింగ్ రంగం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటారు. ఇక మరి కొంత మంది డాన్స్ ప్రోగ్రాంల ద్వారా సినిమాలలో అవకాశాన్ని దక్కించుకుంటారు. ఇక ఈ మధ్య కాలంలో కొంత మంది నటీమణులు మొదటగా యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ లలో నటించి వాటి ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని మెల్లి మెల్లిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

ఇలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి కొంత మంది అనేక దారులలో ప్రయత్నాలు చేస్తూ చాలా సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు. అయినా కూడా కొంత మంది కి హీరోయిన్గా అవకాశాలు దక్కుతాయి అనే నమ్మకం లేదు. ఇకపోతే కొంత మంది కి మాత్రం చాలా ఈజీగా హీరోయిన్గా అవకాశాలు దక్కిన సందర్భాలు ఉన్నాయి. అలా చాలా ఈజీగా మంచి క్రేజ్ ఉన్న సినిమాలోని హీరోయిన్గా అవకాశం దక్కించుకున్న ముద్దుగుమ్మలలో సాక్షి వైద్య ఒకరు. ఈమె సినిమాలలో అవకాశం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదట. ఈమె టైం పాస్ కోసం ఇన్ స్టా లో రీల్స్ చేస్తూ ఉండేదట.

ఇక వాటిని తెలుగు స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి అనుకోకుండా చూడడం , ఆ సమయంలో ఏజెంట్ మూవీ లో హీరోయిన్ కోసం వెతుకుతూ ఉండడం , ఆ సినిమాలో ఈ బ్యూటీ అయితే బాగుంటుంది అని ఆయన అనుకోవడం , ఆ తర్వాత సాక్షి నీ సంప్రదించడం జరిగిందట. ఆమె కూడా ఈ సినిమాకు గ్రీన్ ఇచ్చిందట. అలా ఏ మాత్రం ప్రయత్నాలు చేయకుండానే సాక్షి కి ఏజెంట్ సినిమాలో అవకాశం దక్కిందట. ఏజెంట్ సినిమా తర్వాత కూడా సాక్షి కొన్ని సినిమాలలో నటించింది. ప్రస్తుతం కూడా చాలా తెలుగు సినిమాలలో నటిస్తోంది. ఇలా ఏ మాత్రం ప్రయత్నం చేయకుండానే ఈమెకు సినిమా అవకాశాలు రావడం , ప్రస్తుతం అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరీర్ను కొనసాగించడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sv