పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ సినిమా విడుదలైన ఒక్క రోజులోనే బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన కల్కి సినిమాను సుమంత్ అశ్విన్ నిర్మించారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని, శోభన, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్ వంటి ప్రముఖులు కీలకపాత్రలో నటించారు.

అయితే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ నటన అద్భుతంగా ఉందని అతని నటనే ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక తొలి రోజునే ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది. అయితే ఈ సినిమా అంతా పాజిటివ్ గా ఉంది. కానీ ఒక్క విషయం మాత్రమే తెగ ట్రోల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ పెద్ద మైనస్ అని అంటున్నారు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర అర్జునుడు. అర్జునుడు లాంటి క్యారెక్టర్ ను తెలంగాణ యాసలో మాట్లాడితే ఎలా.... కనీసం విజయ్ మీసాలైనా తీసేసి ఉండాలి. మంచి భాషలో మాట్లాడాలి కదా అని ట్రోల్ చేస్తున్నారు. అయితే దీనిపై చాలా మంది విజయ్ అభిమానులు విజయ్ ను ఎందుకు అంత హేట్ చేస్తున్నారు.


అతను ఆయనకిచ్చిన క్యారెక్టర్ చేశాడు. ఇందులో నెగటివ్ గా ట్రోల్ చేయడానికి ఏముంది అని అంటున్నారు. ఇక నాగ్ అశ్విన్ కి, విజయ్ సెంటిమెంట్. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా నుంచి వీరిద్దరూ మంచి స్నేహితులు అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అర్జునుడి పాత్ర చేయమని అడిగిన వెంటనే విజయ్ ఓకే చెప్పేశారట ప్రస్తుతం ఇదే వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: