వివాదాల దర్శకుడుగా పేరు తెచ్చుకున్న ఆర్జీవి ఈ మధ్యకాలంలో డైరెక్టర్ గా సినిమాలను పెద్దగా చేయడం లేదు. యాక్టర్ గా పలు సినిమాల్లో కనిపించాలి అన్న కోరిక ఆయనలో ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ షార్ట్ ఫిలింలో నటించాడు ఆయన. అందులో తన ఒరిజినల్ రోల్ లోనే కనిపించారు. అయితే తాజాగా ఇప్పుడు ఆర్జీవి బిగ్ స్క్రీన్ పై కనిపించే మొదటి అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆర్జీవి మొట్టమొదటిసారిగా బిగ్ స్క్రీన్ పై కల్కి సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. కాగా ఈ విషయాన్ని స్వయంగా

 ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్గా నటించింది. వారితోపాటు అమితాబచ్చన్ కమలహాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ పలు కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే ఇందులో చాలామంది గెస్ట్ పాత్రల్లో మెరిసారు. రాజమౌళి కూడా చిన్న పాత్రలో కనిపించారు. అలాగే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ఇంటరెస్టింగ్ పాత్రలు చేశారు. కాంట్రవర్సియల్ డైరెక్టర్ ఆర్జీవీని కూడా నాగ్ అశ్విన్ కల్కిలో ఒక పాత్ర కోసం తీసుకున్నారు.  ఆ పాత్రతో హ్యూమర్ క్రియేట్ చేసే

 ప్రయత్నం చేశారు. ఆర్జీవీ కూడా తన స్టైల్ ఆటిట్యూడ్ తో క్యారెక్టర్ ని బాగానే రక్తికట్టించారు. ఇదిలా ఉంటే తాజాగా ఆర్జీవీ తన సోషల్ మీడియా లో నాగ్ అశ్విన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. నాగ్ అశ్విన్ నీ ఆలోచనలు, లక్ష్యాలు ప్రశంసనీయం, ఈ చిత్రంలో ప్రభాస్ ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటి కంటే 100 రేట్లు డైనమిక్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపించాడు. అలాగే నన్ను కల్కి2898ఏడీ ద్వారా నటుడిగా పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న అని ఆర్జీవీ తన సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు. అలాగే రాజమౌళి కూడా కల్కి సినిమాపై ప్రశంసలు కురిపించారు. అద్భుతంగా మూవీ ఉందని చివరి 30 నిమిషాలు ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకొని వెళ్లిపోయారంటూ జక్కన్న నాగ్ అశ్విన్ ని ప్రశంసించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: