దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఆయన ఫ్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించాడు. గతంలో ప్రభాస్ రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాతో ఫ్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును దక్కించుకున్నాడు రాజమౌళి. ఇక ఆ సినిమా తర్వాత త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డును సైతం దక్కించుకున్నాడు. ఎట్టకేలకు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాడు రాజమౌళి. అయితే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో ఒక సినిమా

 చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పనులు సైతం జరుగుతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు తర్వాత రాజమౌళి ఏ హీరోతో సినిమా చేయబోతున్నాడు అన్న వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు రాజమౌళి సైతం ఈ విషయంలో ఒక హింట్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తాజాగా కల్కి మూవీ సెకండ్ హాఫ్ లో జక్కన్న షాకింగ్ రోల్‌ల్లో కనిపించి మెప్పిస్తాడు. ఆ టైంలో ప్రభాస్ ఛాన్స్ ఇస్తే 5 ఏళ్ళు తీసుకున్నావ్ అని చెప్పగా.. ఈసారి దొరికితే పదేళ్లు తొక్కేస్తా

 అంటూ వివరిస్తాడు. ఈ విధంగా ప్రభాస్ తో మరోసారి సినిమాను జక్కన్న ఫిక్స్ చేశారని.. నెటింట కామెంట్లు వినపడుతున్నాయి. ఇక ప్రభాస్, రాజమౌళి కాంబోలో మహాభారతం తెరకెక్కనుందని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. మహేష్ తో సినిమా పూర్తి అయిన వెంటనే రాజమౌళి ఈ ప్రాజెక్ట్ దిశగా అడుగులు వేస్తాడని టక్‌. దీని హింటే ప్రభాస్ కల్కి మూవీలో రాజమౌళి చెప్పిన ఆ డైలాగ్ అంటూ నెట్టింట జక్కన వీడియో తెగ వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ ను బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: