ప్రభాస్ తాజాగా కల్కి 2898 AD అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ నిన్న అనగా జూన్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు ఎవడే సుబ్రహ్మణ్యం , మహానటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా ... అమితా బచ్చన్ , దీపికా పదుకొనే ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. కమల్ హాసన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించగా ... దిశా పటానీ ఈ మూవీ లో ప్రభాస్ కి జోడిగా నటించింది.

ఇక ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఓ చిన్న పాత్రలో నటించగా ... టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ కూడా ఓ చిన్న పాత్రలో నటించాడు. ఇక అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులు అయినటువంటి ఎస్ ఎస్ రాజమౌళి , రామ్ గోపాల్ వర్మ కూడా ఈ సినిమాలో చిన్న క్యామియో పాత్రలలో కనిపించారు. ఇక వీరు కనిపించినది తక్కువ నిడివి ఉన్న పాత్రలే అయినప్పటికీ అందులో విరు బాగానే నవ్వులు పూయించారు. ఇకపోతే ఈ సినిమాకి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున కలెక్షన్ లు వచ్చాయి. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ కి మంచి కలెక్షన్ లే నమోదు అయ్యాయి.

ఇక తాజాగా ఈ మూవీ కి సంబంధించిన కృష్ణ జిల్లా కలెక్షన్ ల రిపోర్ట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి మొదటి రోజు కృష్ణా జిల్లాలో 2.80 కోట్ల షేర్ కలెక్షన్ లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మొదటి రోజు ఈ మూవీ కి కృష్ణా జిల్లాలో మంచి కలక్షన్ లు నమోదు అయ్యాయి. ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ మరికొన్ని రోజుల పాటు కృష్ణా జిల్లాలో మంచి కలక్షన్ లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: