టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైడల్ చిత్రం కల్కి 2898AD చిత్రం.. నిన్నటి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. నార్త్ అమెరికాలో కూడా చాలా షోలు పడ్డాయి. అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కూడా హౌస్ ఫుల్ బోర్డు పెట్టినట్లుగా తెలుస్తోంది. కేవలం ఒక్క రోజులోనే నార్త్ అమెరికాలో 5.5 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక వరల్డ్ వైస్ గా 180 కోట్లకు పైగా కలెక్షన్ చేసిందని ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.. కల్కి ఫస్ట్ డే టాక్ బాగా రావడంతో ఆన్లైన్ టికెట్లు బుకింగ్స్ కూడా భారీగానే పెరిగినట్లు తెలుస్తోంది.

చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కూడా పెట్టేస్తున్నారు. దాదాపుగా మూడు రోజులపాటు కల్కి సినిమా ప్రపంచాన్ని ఎవరు ఆపలేరు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. త్రీడీలో టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నా కూడా చాలామంది చూడడానికి మక్కువ చూపుతున్నారు.. స్టోరీ ప్లస్ పాయింట్ అవ్వడమే కాకుండా నటీనటులు, మహాభారతం కథతో పాటు క్యారెక్టర్లు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మొదటిరోజు కల్కి సినిమాకి 42 కి 42 షోలు హౌస్ ఫుల్ బోర్డు పెట్టినట్లుగా అప్సర సినిమాస్ లో తెలుస్తోంది.


బుక్ మై షో లో అవుట్ ఆఫ్10 కి 9.3 రేటింగ్ తో కల్కి మూవీ కొనసాగుతోంది అలాగే బుకింగ్స్ పరంగా కూడా టాప్ ట్రెండింగ్ లో ఉన్నది.అత్యంత వేగవంతంగా బుకింగ్స్ జరుగుతున్న సినిమాగా కల్కి మూవీ టాప్ లో బుక్ మై షో లో ఉన్నది.. మల్టీఫ్లెక్షన్లలో కూడా టికెట్ ధరలు లెక్కచేయకుండా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడడానికి వెళుతున్నారు. యూత్ కి కావలసిన యాక్షన్ సన్నివేశాలతో పాటు పిల్లలకు కావలసిన గ్రాఫిక్ మాయాజాలం కల్కి చిత్రాన్ని థియేటర్కు రప్పించేలా చేస్తోంది మరి లాంగ్ రన్ టైంలో కల్కి సినిమా ఎలా రాబడుతుందో తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: