నిన్న కల్కి 2898 AD సినిమా థియేటర్లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ప్రభాస్ హీరోగా నటించిన మూవీ కావడం , ఆ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉండడం , ఈ సినిమాలో అమితా బచ్చన్ , దీపికా పదుకొనే , కమల్ హాసన్ , దిశా పటాని కీలక పాత్రలలో నటిస్తూ ఉండడంతో ఈ మూవీ పై మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నిలలోని ఉన్నాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు అద్భుతమైన బ్లాక్ భాస్కర్ టాక్ ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి వచ్చింది.

దానితో ఈ మూవీ కి మొదటి రోజు సూపర్ సాలిడ్ కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా లభించాయి. అందులో భాగంగా ఈ మూవీ కి మొదటి రోజు కేరళ రాష్ట్రంలో కూడా మంచి కలెక్షన్ లు వచ్చాయి. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన కేరళ కలెక్షన్స్ రిపోర్టు బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు కేరళ లో 2.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కినట్లు తెలుస్తోంది.

ఇలా మొదటి రోజు ఈ మూవీ కేరళ లో మంచి కలెక్షన్ లను రాబట్టింది. మరి ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ మూవీ కి కేరళ లో మంచి కలక్షన్ లు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. ఇక ఈ మూవీ ని వైజయంతి మూవీస్ స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించాడు. ఈ మూవీ లో దుల్కర్ సల్మాన్ , విజయ్ దేవరకొండ , రామ్ గోపాల్ వర్మ , ఎస్ ఎస్ రాజమౌళి చిన్న చిన్న పాత్రలలో నటించారు. వీరి పాత్రల నడిపి చాలా తక్కువే ఉన్నప్పటికీ అందులో విరు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: