టైర్ టు హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న మాస్ కా దాస్ విశ్వక్సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం  అవసరం లేదు. అయితే తాజాగా ఈ హీరో సోషల్ మీడియాకి దూరమయ్యాడు. తాజాగా తన ఇంస్టాగ్రామ్ అకౌంటర్ క్లోజ్ చేశాడు. దీంతో ఈ వార్త విన్న ఆయన అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. ఇంత సడన్గా విశ్వక్సేన్ సోషల్ మీడియా ఎందుకు డిలీట్ చేశాడు.. అసలు అంత అవసరం ఏం వచ్చింది.. ఏమైనా ప్రాబ్లమా లేదా ఆయన ఇన్స్టాల్ అకౌంట్ కి ఏదైనా అయ్యిందా అంటూ రకరకాలుగా ఆరాలు తీయడం మొదలుపెట్టారు. కానీ తాజాగా

 అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల జరిగిన ఒక వివాదమే ఎందుకు కారణమని అంటున్నారు. ఇటీవల జరిగిన వివాదం కారణంగానే విశ్వక్ ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అయితే ఇంతకీ ఆ నిర్ణయం ఏంటి అన్న విషయంలోకి వెళ్తే.. విశ్వక్సేన్ ఇటీవల సోషల్ మీడియాలో సినిమాలపై రివ్యూ ఇచ్చే బ్యాచ్ గురించి ఒక పోస్ట్ చేయడం జరిగింది. అలాగే కల్కి సినిమా గురించి ఒక యూట్యూబ్  చేసిన వీడియో గురించి ఆయన మాట్లాడుతూ... ఇంకా విడుదల కూడా కానీ సినిమా గురించి

 అప్పుడే రివ్యూలో ఇవ్వడం మొదలుపెట్టేశారు. మీకు దమ్ముంటే ఒక షార్ట్ ఫిల్మ్ చేసి చూపించు అంటూ కౌంటర్ వేశాడు. దానికి ఆ యూట్యూబర్ కూడా అదే రేంజ్ లో గట్టిగానే సామాధానం ఇచ్చాడు. ఈ వివాదం జరిగిన కొన్నిరోజులకే విశ్వక్ సేన్ సోషల్ మీడియా నుండి బయటకు వచ్చేశాడు. దాంతో ఆ వివాదం కారణంగానే ఆయన ఇలా చేసుంటారని అందరు అనుకుంటున్నారు. కొందరేమో.. ప్రస్తుతం విశ్వక్ సేన్ సినిమాలేవి విడుదలకు సిద్ధంగా లెవ్. మళ్ళీ సినిమా రిలీజ్ టైం కి ఇన్స్టాకి వస్తారని కొందరు అభిప్రాయం పడుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: