గత ఏడాది సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఫ్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్. అయితే తాజాగా ఇప్పుడు కల్కి సినిమాతో సలార్ కంటే మించిన హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాతో ప్రభాస్ క్రేజ్ అంతకంతకు పెరిగిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రభాస్ నటించిన కల్కి సినిమా మొదటి రోజు కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నప్పటికీ వాటిలో ఎటువంటి నిజం లేదు అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక

 ప్రకటన వస్తే కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలుస్తుంది. అయితే ప్రభాస్ చాలా లిమిటెడ్ గా మాట్లాడతాడు అన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా ఇంటర్వ్యూలలో ప్రభాస్ అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇస్తూ ఉంటాడు. అతిగా ఎప్పుడో మాట్లాడడు. అంతేకాదు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ల లో సైతం ప్రభాస్ రెండు మూడు నిమిషాలు కూడా సరిగా మాట్లాడు. ఆయన రెండు మూడు నిమిషాలు మాట్లాడితే అదే పండగ అని ఫీల్ అవుతూ ఉంటారు ఆయన అభిమానులు. ఇక ప్రభాస్ కి ఇంత స్టార్ డం రావడం వెనుక ఎంతో కష్టం ఉంది. ఈశ్వర్ రాఘవేంద్ర వంటి సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఆ తర్వాత వర్షం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు.

 అలాగే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని దక్కించుకున్నాడు. కేవలం ఈ సినిమా కోసమే దాదాపుగా ఆరు సంవత్సరాలు కష్టపడ్డాడు ప్రభాస్. బాహుబలి సక్సెస్ తర్వాత కూడా యంగ్, టాలెంటెడ్ దర్శకులకు పభాస్ ఎక్కువగా అవకాశాలను ఇస్తున్నారు. చిరునవ్వే ప్రభాస్ ఆయుధం అని ఫ్యాన్స్ భావిస్తారు. ప్రభాస్ బాల్యం కొంతమంది ఫ్రెండ్స్, బంధువుల మధ్య గడిచిపోయింది. బయటి వారిని చూసింది తక్కువ. అందువల్లే ప్రభాస్ కొత్త వాళ్ల ముందు, కొత్త ప్రదేశాలలో ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడరని తెలుస్తోంది. ఒక సందర్భంలో ప్రభాస్ మాట్లాడుతూ నాకంటే ఎక్కువ విజయాలు సాధించిన వాళ్లు సైతం వినయంగా ఉన్నారని చిరంజీవి, రజనీకాంత్ లాంటి వాళ్ల ముందు నేను చిన్నవాడినని ప్రభాస్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: