పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ కల్కి మూవీ విడుదలై సంచలనం సృష్టిస్తోంది. హాలీవుజ్ రేంజ్లో సైన్స్‌కు మైథాలజీని ముడిపెట్టి దర్శకుడు నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంటోంది. ప్రభాస్‌తో పాటు ఇతర స్టార్ యాక్టర్స్ నటనకు ఆడియెన్స్‌ ఫిదా అయిపోతున్నారు. కథతో పాటు యాక్షన్ సీన్స్ అదిరిపోయిందని రివ్యూలు ఇస్తున్నారు. అయితే ఈ సినిమా సక్సెస్ ఇప్పుడు సూర్య చేయబోయే కర్ణ సినిమా పై పడిందని అంటున్నారు. దీంతో కర్ణ సినిమా గురించి సోషల్ మీడియాలో

 పెద్ద ఎత్తున వార్తలను ప్రచారం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ మెహరా సూర్య కాంబోలో ఈ సినిమా రాబోతున్నట్లుగా ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో ద్రౌపతి పాత్రలో జాహ్నవి కపూర్ ను ఇప్పటికే ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి ఏడాది కావస్తోంది. కానీ ఇప్పటివరకు షూటింగ్ మాత్రం స్టార్ట్ చేయలేదు. ఇదిలా ఉంటే కల్కి సినిమాలో కురుక్షేత్రం ఎపిసోడ్ లో ప్రభాస్ కర్ణుడి పాత్రలో కొద్దిసేపు కనిపించాడు. ఈ సీక్వెన్స్ కి పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ విధంగా చెప్పాలంటే విజిల్స్ పడ్డాయి. దీనిని బట్టి

 అర్జునుడి కంటే కర్ణుడి పాత్రకి ప్రజలు ఎక్కువగా కనెక్ట్ అయ్యారని అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సూర్య హీరోగా రాబోయే కర్ణ సినిమాకి పబ్లిక్ నుంచి ఇంతే రెస్పాన్స్ వస్తుందని అంచనా వేస్తున్నారు.   సూర్య కంగువ మూవీతో అక్టోబర్ 10న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ తర్వాత కర్ణ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. మరి కర్ణుడి పాత్రలో సూర్య ఏ మేరకు మెప్పిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కల్కి సినిమా రిజల్ట్ ఇప్పుడు చాలా పెద్ద సినిమాలకి తలనొప్పిగా మారింది అని చెప్పొచ్చు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: