రెబల్ స్టార్ ప్రభాస్ కి మిర్చి సినిమా వరకు కేవలం తెలుగు సినీ పరిశ్రమంలో మాత్రమే స్టార్ ఈమేజ్ ఉంది. అంతకుముందు ఇతర పరిశ్రమలలో ప్రభాస్ కి పెద్దగా మార్కెట్ లేదు. మిర్చి సినిమా తర్వాత ప్రభాస్ , రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 1 , బాహుబలి 2 సినిమాలలో హీరోగా నటించాడు. ఈ రెండు మూవీ లు కూడా ఇండియా వ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నాయి.

ఈ రెండు సినిమాల విజయాలతో ప్రభాస్ కి తెలుగు తో పాటు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. మరీ ముఖ్యంగా ఈయనకు హిందీ మార్కెట్లో అత్యంత ఈమేజ్ దక్కింది. దానితో బాహుబలి సిరీస్ మూవీల తర్వాత నుండి ఈయన ఏ సినిమాలో నటించిన ఆ మూవీకి హిందీలో టాక్ తో సంబంధం లేకుండా మంచి కలక్షన్లు వస్తున్నాయి. ఇక మంచి టాక్ వచ్చినట్లు అయితే సూపర్ సాలిడ్ కలెక్షన్స్ ప్రభాస్ మూవీ కి హిందీ ఏరియా నుండి లభిస్తున్నాయి.

తాజాగా ప్రభాస్ "కల్కి 2898 AD" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ నిన్న థియేటర్లో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాను హిందీలో కూడా భారీ ఎత్తున విడుదల చేశారు. మొదటి నుండి కూడా ఈ సినిమా యొక్క అడ్వాన్స్ టికెట్ బుకింగ్ లకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ కి హిందీ ఏరియా నుండి 20 కోట్ల కలెక్షన్స్ అవలీలగా వస్తాయి అని , ఒక వేళ హిట్ టాక్ వచ్చినట్లయితే 25 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చిన పెద్దగా ఆశ్చర్యం ఏమీ లేదు అని వార్తలు వచ్చాయి.

ఇకపోతే ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు హిందీలో 22.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా కల్కి సినిమాకు మొదటి రోజు హిందీ ఏరియా నుండి సూపర్ సాలిడ్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: