రెబల్ స్టార్‌ ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 AD..స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమా ను విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మించాడు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్, దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.ఈ సినిమా లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్ నటించారు.. ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేసారు.భారీ బడ్జెట్ భారీ బడ్జెట్‌ తో బిగ్గెస్ట్ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి రోజే ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.కల్కి సినిమా సూపర్ గా ఉందంటూ ఫ్యాన్స్‌ తో పాటు ప్రేక్షకులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు రూ.600 కోట్ల తో తెరకెక్కిన కల్కి  సినిమా సందడి  గురువారం ఉదయం నుంచే  మొదలైంది. 

దీంతో ప్రభాస్ సక్సెస్‌ను థియేటర్ల వద్ద ఫ్యాన్స్‌ విపరీతం గా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.తాజాగా ఈ మూవీ పై సంచలన డైరెక్టర్‌ ఆర్జీవీ ప్రశంసలు కురిపించారు. ముఖ్యం గా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ను ఎంతగానో కొనియాడారు. నీ ఆశయం, ఊహలకు నా అభినందనలు. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ వందరెట్లు ఎక్కువగా చూపించారు. ప్రభాస్‌ ను ఇంతకు ముందెప్పుడు ఇలాంటి లుక్‌ లో చూడలేదు. అదేవిధంగా తొలిసారి నాకు నటించేందుకు అవకాశ మిచ్చినందుకు ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. కాగా.కల్కి చిత్రం లో ఆర్జీవీ అతిథి పాత్ర లో కనిపించారు. అంతే కాకుండా విజయ్‌ దేవరకొండ, మృణాళ్‌ ఠాకూర్‌, దుల్కర్‌ సల్మాన్‌ వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో అద్భుతంగా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: