రెబల్ స్టార్ ప్రభాస్ చాలా కాలం క్రితమే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ని ప్రారంభించాడు. ఈ మూవీ లో నిధి అగర్వాల్ , మాళవిక మోహన్ , రీద్దీ కుమార్ లు ప్రభాస్ సరసన హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. ఈ మూవీ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత టి జి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ ఏ మాత్రం హడావిడి లేకుండా చాలా సింపుల్ గా స్టార్ట్ అయింది. 

ఇక ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న ఈ మూవీ బృందం ఎలాంటి అప్డేట్ లను విడుదల చేయలేదు. అప్డేట్ల గురించి ఈ మూవీ బృందాన్ని కొంత మంది పత్రిక విలేకరులు అడగగా ప్రస్తుతం ప్రభాస్ "కల్కి" సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఆ మూవీ విడుదల తర్వాతే మా సినిమాకు సంబంధించిన అప్డేట్లు ఉంటాయి అని ఈ మూవీ బృందం వారు సమాధానం ఇచ్చారు. కొంత కాలం క్రితం రాజా సాబ్ మూవీ నుండి ప్రభాస్ కు సంబంధించిన ఒక పోస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు.

దానికి మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. ఇకపోతే నిన్న ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి సినిమా థియేటర్లలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక కల్కి సినిమా విడుదల కావడంతో ఇకపై మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాకు సంబంధించిన అప్డేట్లు వరుసగా వస్తాయి అని ప్రభాస్ అభిమానులు మరియు మామూలు సినీ ప్రేమికులు కూడా ఆశిస్తున్నారు. ఇకపోతే ప్రభాస్ , మారుతి కాంబోలో రూపొందుతున్న సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: