నాగీ సూపర్ ప్లాన్? యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి కల్కి 2898ఏడీ సినిమాతో బాక్సాఫీస్ కింగ్ అనిపించుకున్నారు. ఈ సినిమాకి చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రమోషన్స్ చేయకపోయిన ఊహించని స్థాయిలో హైప్ అయితే క్రియేట్ అయ్యింది.ఈ సినిమాకి భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. మొదటి మూడు రోజులకి చాలా చోట్ల థియేటర్స్ అన్ని ఫుల్ అయిపోయాయి. రెండు ట్రైలర్స్ తోనే సినిమా ఎలా ఉండబోతోందనేది డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఆడియన్స్ కి పరిచయం చేసేశారు. దీంతో కల్కి సినిమా చూడాలనే ఇంటరెస్ట్ అందరికి పెరిగింది.. ఫస్ట్ రోజు 191.5 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది ఈ సినిమా. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని అశ్వినిదత్ ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొనే, దిశా పటాని ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. అయితే కల్కి సినిమా చూసినట్లయితే టైటిల్ లో పేర్కొన్న మెయిన్ పాత్ర కల్కి ప్రభాస్ చెయ్యడని అర్థం అవుతుంది.


ఎందుకంటే ఈ సినిమాలో ప్రభాస్ ని కర్ణుడిగా నాగ్ అశ్విన్ చూపించాడు. సుమతి క్యారెక్టర్ చేసిన దీపిక పడుకొనే కడుపున పుట్టేది కల్కి.. సినిమా మొత్తం కల్కి చుట్టూనే ఉంటుంది కాబట్టి కల్కి పాత్ర పోషించే వారే మెయిన్ హీరో అని తెలుస్తుంది. నెక్స్ట్ పార్ట్ లో నాగ్ అశ్విన్ కల్కి క్యారెక్టర్ కి వేరే పెద్ద హీరోని తీసుకునే ఛాన్స్ ఉంది. పైగా కల్కి మామూలు క్యారెక్టర్ కాదు కాబట్టి ఎలివేషన్స్ కూడా పీక్స్ లో ఉంటాయి. అంతటి ఎలివేషన్స్ ఇవ్వాలంటే ప్రభాస్ కి దీటైనా స్టార్ హీరో ఆ రోల్ చెయ్యాలి. మరి ఆ రోల్ కి నాగ్ అశ్విన్ ఏ టాప్ హీరో చేస్తాడో అని టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.మొత్తానికి దీన్ని బట్టి కల్కి 2898 ఏడి సినిమాకి ప్రభాస్ మెయిన్ హీరో కాదని తెలుస్తుంది. ఏది ఏమైనా నాగ్ అశ్విన్ ప్లాన్ మాత్రం అదుర్స్ అంటున్నారు నెటిజన్స్..

మరింత సమాచారం తెలుసుకోండి: