కల్కి చిత్రం నిన్నటి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ సినిమా పైన అభిమానులు భారీ హైప్స్ పెట్టుకున్నప్పటికీ.. అంతకుమించి ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ చిత్రంలో భారీతారాగణం కనిపించడం కూడా ప్లస్ గా మిగిలింది.. ముఖ్యంగా ఈ చిత్రంలో అతిథి పాత్రలు చాలా ఎక్కువగానే కనిపించాయి.ప్రతిపాత్ర కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ పాత్రలను సర్ప్రైజ్ గా ఉంచాలనుకున్నారు.. కానీ కొన్ని పాత్రలను మాత్రం లీక్ చేసినట్లుగా తెలుస్తోంది.


గతంలో ఇన్స్టాగ్రామ్ లైవ్ లో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ వంటి సెలెబ్రిటీలు థాంక్స్ చెప్పడంతో ఈ నటులు సైతం కల్కి చిత్రంలో ఉన్నట్లుగా అందరికీ తెలిసిపోయింది.. అయితే విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో దుల్కర్ సల్మార్ మరో కీలకమైన పాత్రలో కనిపించారు.. కానీ దుల్కర్ సల్మాన్ పాత్ర ఈ విధంగా ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు.. అలాగే ఆ పాత్ర పై ప్రేక్షకులు మరికొంత అనుమానం కూడా కలిగించిందని చెప్పవచ్చు. ఈ సినిమా చూసిన తరువాత కల్కి రాబోయే భాగాలలో దుల్కర్ పాత్ర మరింత ప్రాధాన్యత ఉంటుందని అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.


ముఖ్యంగా సినిమాలో చిన్నప్పుడు ప్రభాస్ పాత్రను పెంచిన పైలెట్ పాత్రలో దుల్కర్ అద్భుతంగా నటించారు.. ఈ క్యారెక్టర్ ప్రభాస్ కు జీవిత పాఠాలు నేర్పించడం వంటివి చూపించారు. ఈ పాత్రకు ముందు కూడా కథలో కీలకమైన విషయంగా ఉంటుందని చెప్పవచ్చు. మహాభారతంలోని పాత్రలను మళ్లీ పుట్టినట్లుగా కల్కి చిత్రంలో చూపించారు. రాబోయే కల్కి ఫ్రీక్వెల్లో కచ్చితంగా పరుశురాముడు పాత్రలో దుల్కర్ కల్పించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే కల్కి పురాణాల ప్రకారం కల్కి అవతారానికి యుద్ధ విద్యలు నేర్పించిన గురువు గానే పరుశురాముడే ఉన్నారు. మరి ఇవే ప్రేక్షకులలో మరింత ఆసక్తిని సైతం పెంచేలా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: