![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/depika-kalki-moviea3f227af-9118-4c9b-8fc3-0e37ef8e9bbe-415x250.jpg)
హాలీవుడ్ మూవీలో కూడా దీపికా పదుకొనే నటించేంతలా ఎదిగింది. ప్రస్తుతం ఇండియాలో అత్యధికంగా రేమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్గా పేరు సంపాదించింది. గత ఏడాది షారుక్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ వంటి చిత్రాలలో కూడా నటించింది. ఈ రెండు చిత్రాలు రూ .1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడం గమనార్హం. బ్యాక్ టు బ్యాక్ 1000 కోట్లు కలెక్షన్ సాధించిన చిత్రాలలో భాగమైన ఈ ముద్దుగుమ్మ ఒక అరుదైన ఘనతను కూడా సాధించింది. ఇప్పుడు తాజాగా కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ కు జోడిగా నటించిన దీపికా పదుకొనే ఈ చిత్రం పాన్ వరల్డ్ చిత్రంగా విడుదల అయింది.
కల్కి చిత్రంలో ఈమె పాత్ర చాలా బలంగా ఉండేలా కనిపిస్తోంది. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో కలిసి సినిమా ఖచ్చితంగా రూ.1000 కోట్ల క్లబ్లో చేరుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ 1000 కోట్లకు పైగా కలెక్షన్ సాధిస్తే మూడు సినిమాలు 1000 కోట్ల చిత్రాలలో భాగమైన హీరోయిన్గా ఒక అరుదైన రికార్డును సంపాదించుకుంటుంది. కల్కి చిత్రంతో హాలీవుడ్లో మరింత గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమని అభిమానులు తెలియజేస్తున్నారు. మొదటి రోజు 180 కోట్లకు సంపాదించిన కల్కి చిత్రం వీకెండ్ పూర్తి అయ్యేసరికి 500 కోట్లకు రీచ్ అవుతుందని నిపుణులు తెలుపుతున్నారు.