ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన కూడా ప్రభాస్ కల్కి మూవీ మేనియానే కొనసాగుతోంది నాగ్ అశ్విన్ కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకేక్కించిన ఈ మూవీ ఇక అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూల్ల సునామీ సృష్టిస్తుంది అని చెప్పాలి. మైథాలజికల్ అనే కాన్సెప్ట్ కి సైన్స్ ఫిక్షన్ ఫ్యూచర్స్టిక్ నీ జోడించిన నాగ్ అశ్విన్ తన విజన్ తో ఇక ఈ మూవీ ని తెరకెక్కించాడు. ఇక ఈ మూవీ ప్రేక్షకులు అందరిని కూడా కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.


 తొలి రోజు నుంచే బాక్సాఫీస్ పై వసూళ్ల దండయాత్ర చేస్తూ దూసుకుపోతుంది కల్కి మూవీ  ఇక కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా భారీగా వసూళ్లు సాధిస్తుంది అని చెప్పాలి. అయితే ఇక ఈ మూవీలోని వండర్ విజువల్స్ చూసిన తర్వాత డైరెక్టర్ నాగిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు ప్రేక్షకులు. అయితే కల్కి 2898 ఏడి సినిమాకు పార్ట్ 2 కూడా ఉండబోతుంది అని తెలియడంతో ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇప్పుడు డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 కల్కి 2898ఏడి అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నాగ్ అశ్విన్ కు ఇప్పుడు ఒక జాక్పాట్ దక్కినట్లు తెలుస్తోంది. తదుపరి సినిమా ఒక టాలీవుడ్ స్టార్ హీరో తో చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఆ హీరో ఎవరో కాదు ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా కొనసాగుతున్న రామ్ చరణ్ నట. అయితే నిన్న మొన్నటి వరకు నాగ్ అశ్విన్ అంటే ఒక సాదాసీదా డైరెక్టర్ మాత్రమే అని అందరూ అనుకునేవారు. కానీ కల్కి సినిమా తర్వాత నాగీ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే కల్కి మూవీ చూసిన రామ్ చరణ్ ఏకంగా ఇంప్రెస్ అయిపోయాడట. స్వయంగా నాగీకి ఫోన్ చేసి విష్ చేశారట. ఇక వీళ్ళ మాటల సందర్భంలో ఒక ప్రాజెక్ట్ కన్ఫార్మ్ అయినట్లు టాక్ వినిపిస్తుంది. ఇక ఇది కల్కి కంటే మరింత భారీ బడ్జెట్ తో తెరకెక్కిపోతుంది అని సమాచారం. దీంతో ఇక ఇప్పటినుంచే ఈ మూవీపై అంచనాలు పెరిగిపోతున్నాయి. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: