కల్కి సినిమా ఈనెల 27వ తేదీన విడుదల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సంపాదించుకుంది.. అయితే కల్కి సినిమా చూసిన వారందరికీ మహాభారతం తెలిసి ఉంటే ఈ సినిమా కథ మరింత అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారిన ప్రశ్న ఏమిటంటే మహాభారతం లో కర్ణుడు, అర్జునుడు పాత్రల ప్రస్తావన కూడా చూపించారు. ముఖ్యంగా కల్కి క్లైమాక్స్ అద్భుతంగా ఉందని.. మహాభారతం రిఫరెన్స్ అందరినీ ఆకట్టుకునేలా చిత్రీకరించారు డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ఇందులో కర్ణుడిగా ప్రభాస్ నటించారు.


ఇక్కడే అసలైన సమస్య మొదలయ్యింది.ప్రభాస్ హీరో కర్ణుడి పాత్రలో చాలా హుందాతనంతో కనిపించగా అసలు మహాభారతంలో అందరికంటే పరాక్రవంతుడు కర్ణుడే అని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే మహాభారతం గురించి కాస్త లోతుగా వెళితే.. అర్జునుడి కంటే.. కర్ణుడు ఎంత బలహీనమైన వాడో.. అలాగే ఎన్ని యుద్ధాలు ఓడిపోయాడో పర్వాలతో సహా తెలియజేస్తూ ఉన్నారు.. ముఖ్యంగా మహాభారతంలో శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనడు, కర్ణుడు ఈ నలుగురు చెడ్డ పనులకు చాలా ప్రతీది అని కూడా చెప్పవచ్చు. స్వయంగా ఈ విషయాన్ని వ్యాస  భగవానుడే దుష్ట చతుష్టం అని ఈ నలుగురిని వర్ణించడం జరిగింది.


కర్ణుడు అభిమన్యుడిని చంపిన వారిలో ఒకడు చివరికి అర్జునుడి చేతిలో వధించబడిన వాడిగా.. అలాగే అర్జునుడి కంటే కర్ణుడు ఎందులోనూ గొప్ప కాదని కూడా వాదిస్తూ ఉంటారు. వాస్తవానికి పురాణాలనుంచి ఇలాంటి సన్నివేశాలు తీసుకొని ఏ సినిమా వచ్చినా కూడా తెర మీదకి చర్చనీయాంశంగా ఈ విషయం మారుతూనే ఉంటుంది. నిజానికి ఈ అనుమాన సినిమాలలోనే కాదు పుస్తకాలలో కూడా జరుగుతూ ఉంటుంది.. కర్ణుడు గొప్పతనం గురించి ప్రవచనం చెప్పమంటే అతను అంత వీరుడు సూర్యుడు మరొకరు లేరని కూడా చెప్పేవారు చాలామంది ఉన్నారు.. అర్జునుడి ముందు కర్ణుడు తక్కువ అని కూడా నొక్కి చెప్పిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ సినిమాలను బట్టి చూస్తే పాత్ర చేసే హీరోని బట్టే కొన్ని సన్నివేశాలు నడుస్తూ ఉంటాయని చెప్పవచ్చు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ అర్జునుడి పాత్ర నటిస్తే యుద్ధంలో కర్ణుడిని భయపడినట్లు చూపించారు.. ఒకవేళ ఎన్టీఆర్ కర్ణుడి పాత్ర వేస్తే యుద్ధ భూమిలో అర్జునుడు వనిగిపోయినట్లుగా చూపించారు.. అయితే సినిమాలోని కోణాన్ని ప్రేక్షకులు ఎలా ఆస్వాదిస్తారని దానిపైన ఆధారపడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: