పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఈనెల 27న పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై భారీ విజయాన్ని అందుకున్నది.. దీంతో ప్రభాస్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు..టాలీవుడ్ లో నాగ్ అశ్విన్ డైరెక్టర్గా అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.. రూ.600 కోట్ల రూపాయల బడ్జెట్ తోనే సినిమా తీయడం.. 800 కోట్ల రూపాయల బిజినెస్ కూడా ముందే జరిగిపోవడం వంటివి జరిగింది. ఇక కలెక్షన్స్ పరంగా ఎన్ని వందల కోట్లు వస్తుందో లెక్క తెలియడం లేదు. మొత్తం మీద 1000 కోట్లు ₹1200 కోట్ల వరకు టార్గెట్ అయితే వినిపిస్తోంది.


ఇదంతా ఒక ఎత్తు అయితే నాగ్ అస్విన్ .. అశ్వనీ దత్ అల్లుడు కూడ. నాగ్ అశ్విన్ కి ఒక సెంటిమెంట్ ఉంది. అలాగే అశ్విని దత్తు గారికి కూడా గతంలో కొన్ని సెంటిమెంట్స్ ఉన్నవి.. ఇప్పుడు ఈ విషయమే ఒక చర్చనీయాంశంగా మారింది. అది విజయ్ దేవరకొండ సెంటిమెంట్ అన్నట్లుగా తెలుస్తోంది. ఇంత పెద్ద సినిమాలో కూడా విజయ్ దేవరకొండ ని ఒక పాత్రగా తీసుకురావడం అన్న అంశం ఇప్పుడు తెరమీదకి వచ్చింది. వాస్తవంగా విజయ్ దేవరకొండ తో చూపించింది కొంతసేపు అయినా తన క్యారెక్టర్ కి మంచి పేరు వచ్చేలా చేశారు నాగ్ అశ్విన్.


విజయ్ దేవరకొండకు సంబంధించి నాగ్ అశ్విన్ కి సెంటిమెంట్ గా మారిందనే చర్చ జరుగుతోంది. గతంలో ఎవడే సుబ్రహ్మణ్యం హీరో నాని అయితే.. విజయ్ దేవరకొండది ముఖ్యపాత్ర. ఆ సినిమా హిట్ అయింది. అలాగే సెకండ్ మూవీ మహానటి చిత్రంలో కూడా ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అందులో కూడా విజయ్ దేవరకొండ ఒక స్పెషల్ రోల్స్లో నటించారు. ఈ సినిమా కూడా హిట్ అయింది. ఇప్పుడు కల్కి చిత్రంలో కూడా చేశారు. కల్కి సినిమా కూడా సూపర్ హిట్ అన్నట్లుగా తెలిసిందే.. సెంటిమెంటు కోసం ఇందులో విజయ్ దేవరకొండను కూడా తీసుకువచ్చారా అనే అంశం వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: