హిందీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటిమని మృణాల్ ఠాకూర్. ఈమె నటించిన సీరియల్స్ కు మంచి గుర్తింపు రావడంతో ఈమెకు సినిమాలలో అవకాశం వచ్చింది. అందులో భాగంగా ఈమె మొదటగా తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న జెర్సీ మూవీ హిందీ రీమేక్ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద ప్రభావాన్ని చూపకపోయినప్పటికీ ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈ బ్యూటీ కి మంచి గుర్తింపు లభించింది.

ఆ తర్వాత ఈమెకు తెలుగులో అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె హను రాగవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన సీత రామం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఈమె హాయ్ నాన్న , ది ఫ్యామిలీ స్టార్ అనే రెండు మూవీలతో కూడా ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలలో  హాయ్ నాన్న మూవీ మంచి విజయం సాధించగా , ది ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రేక్షకులను నిరుత్సాహ పరిచింది. ఇకపోతే తాజాగా ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే.

మూవీ జూన్ 27 వ తేదీన థియేటర్లో విడుదల అయింది. ఈ సినిమాలో మృణాల్ ఠాగూర్ ఒక చిన్న పాత్రలో నటించింది. తాజాగా ఈ బ్యూటీ ఆ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఈమె కల్కి సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. కల్కి సినిమాలో నాకు అవకాశం వచ్చినప్పుడు నేను ఆ సినిమాలో ఏ పాత్ర చేయబోతున్నాను. అది ఎంత రన్ టైమ్ తో ఉంటుంది ఇలాంటి ఏ విషయాలను కూడా నేను అడగలేదు. జస్ట్ వారు అడిగారు. నేను వెళ్లి ఆ సినిమా చేశాను అని చెప్పింది. ఇక ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

mt