కొన్ని సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల అవుతూ ఉంటాయి. కానీ ఏ స్థాయిలో అంచనాల నడుమ సినిమాలు విడుదల అవుతాయో అందులో కనీసం సగం స్థాయి విజయాలను కూడా అందుకోవు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినట్లయితే ఆ సినిమాల ద్వారా హీరోలకు మాత్రమే కాకుండా ఆ సినిమాలను తెరకెక్కించిన దర్శకులకు కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది.

ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో నటించాడు. కానీ కొన్ని సినిమాల కోసం ఆయన ఎంతగా కష్టపడినా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆయనకు అలాంటి సినిమాల ద్వారా ఫ్లాప్ లు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఈయన కెరియర్ లో ఎంతో కష్టపడి నటించిన సినిమాలు అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినవి కంత్రి , శక్తి. ఇక ఈ రెండు సినిమాల అపజయాలకు అనేక కారణాలు ఉన్నాయి. మొదటగా చూసినట్లయితే మహేష్ బాబు హీరోగా రూపొందిన పోకిరి సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.

సినిమా తర్వాత కంత్రి మూవీ ని తెరకెక్కించారు. ఇక కంత్రి మూవీ లో హీరో క్యారెక్టర్ దాదాపుగా పోకిరి సినిమాలో హీరో క్యారెక్టర్ కి చాలా దగ్గరగా ఉంటుంది. కానీ కథలో అంత బలం లేకపోవడం వల్ల ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. రామ్ చరణ్ హీరోగా రూపొందిన మగధీర సినిమా తర్వాత శక్తి మూవీ విడుదల అయింది. మగధీర మూవీ లాంటి కథతోనే దాదాపుగా శక్తి మూవీ కథ కూడా ఉంటుంది. కానీ మగధీర సినిమాలో ఉన్న ఎమోషన్స్ శక్తి చిత్రంలో లేకపోవడం వల్ల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఈ రెండు సినిమాలలోని ఎన్టీఆర్ నటనకు మాత్రం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: