కల్కి మూవీ పాజిటివ్ మౌత్ టాక్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా మైథలాజికల్ స్టోరీ తో వచ్చింది అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాంతో ఈ జానర్‌లో వచ్చే సినిమాలు ప్రేక్షకులు ఆదరిస్తారని ఒక నమ్మకం కుదిరింది. పుస్తకాలలో ఉన్న కథలని మార్చకుండా వాటికే ఎక్స్‌లెంట్ విజువల్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తే సూపర్ హిట్ ఖాయం అనే విషయాన్ని కూడా కల్కి నిరూపించింది. తెలిసిన కథలే అయినా మోడర్న్ హీరోలతో హై టెక్ ఎఫెక్ట్స్ తో మైథాలజీ స్టోరీస్ తెరకెక్కిస్తే విజయం సాధించవచ్చు అని కల్కి 2898 AD ప్రూవ్ చేసింది.

నాగ్ అశ్విన్ తీసిన సినిమాలో మైథాలజీ ఎలిమెంట్స్, క్యారెక్టర్స్ ఉన్నాయి. కానీ దీన్ని ఒక ఫ్యూచరిస్టిక్ మూవీగా రూపొందించారు. ఇది మైథాలజీ-సైన్స్-ఫిక్షన్ డ్రామాగా వచ్చిందని చెప్పుకోవచ్చు. కథ చాలా భిన్నంగా ఉండటం వల్ల ఆడియన్స్ దీనికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ వీకెండ్ వరకు థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గదు అని విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే ఈ సినిమా సక్సెస్ చూసి గజినీ ఫేమ్ సూర్య బాగా సంతోష పడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ హీరో ఇప్పుడు "కర్ణ" టైటిల్‌తో ఒక మైథాలజికల్ మూవీ చేస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ రూ.350 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీలో ద్రౌపదిగా జాన్వీ కపూర్ ఎంపికైనట్లు చెబుతున్నారు. ఇక్కడ ఒక విచిత్రం ఉంది అదేంటంటే ఈ సినిమాని అనౌన్స్ చేసి ఏడాది గడిచిపోతున్నా దీన్ని ఇంకా స్టార్ట్ చేయలేదు.

కల్కి మూవీలో కురుక్షేత్రంలో ప్రభాస్ కర్ణుడి రోల్‌లో అలరించాడు. కర్ణుడి పాత్రలో ప్రభాస్ కనిపించడంతో ప్రేక్షకులు విజిల్స్ వేస్తూ థియేటర్స్ దద్దరిల్లిలా చేశారు. ఈలలు వేస్తూ చాలా సందడి చేశారు. దీనిని బట్టి అర్జునుడి కంటే కర్ణుడి రోల్‌కు ప్రజలు బాగా కనెక్ట్ అయి ఎంజాయ్ చేశారు. అయితే కొద్దిసేపు అనిపించినా కర్ణుడి పాత్రను చూసే ఇంతలా ఎంజాయ్ చేస్తే ఫుల్ లెన్త్ కర్ణుడి పాత్రతో సూర్య చేయబోయే సినిమా వస్తోంది. కాబట్టి దీనికి మంచి రెస్పాన్స్ వస్తుందని చాలామంది అంటున్నారు.

సూర్య "కంగువ" మూవీ అక్టోబర్ 10న ఇండియా వైడ్‌గా విడుదల అవుతుంది. దీని తర్వాత కర్ణ మూవీ షూటింగ్ ప్రారంభం కావచ్చు. కర్ణుడి పాత్రలో సూర్య అద్భుతంగా నటిస్తాడని చెప్పవచ్చు ఎందుకంటే అతను ఇంత ముందు బోధి ధర్మ పాత్రలో చాలా బాగా నటించి మెప్పించాడు. ప్రభాస్ కర్ణుడిగా కనిపించే గట్టెక్కాడు మరి ఈ హీరో మూవీ ఔట్‌కమ్‌ ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: