నాగ్‌ అశ్విన్‌, ప్రభాస్ కాంబినేషన్‌లో రూపొందిన 'కల్కి 2898 AD' జూన్ 27న విడుదలైంది. రూ.600 కోట్ల బడ్జెట్ తో తలకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రూ.200 కోట్ల వరకు డబ్బులు వసూలు చేసింది. వారం రోజుల్లోనే పెట్టిన బడ్జెట్ మొత్తం తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ మూవీ కథ, విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయని చాలామంది సెలబ్రిటీలు కామెంట్లు చేశారు. ఇక ఈ సినిమాలో నటించిన వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే 'కల్కి'లో (Kalki 2898 AD) సుప్రీం యాస్కిన్, పోషించిన కమల్‌ హాసన్‌ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఇందులో ఈ లోక నాయకుడు స్వయం ప్రకటిత దేవుడిగా కనిపించి మెప్పించాడు.ప్రభాస్‌ (Prabhas) భైరవగా నటిస్తే, ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీలో కమల్‌ హాసన్‌ విలన్‌గా నటించి వావ్ అనిపించాడు. చెన్నైలో ఈ మూవీ చూశాక ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''కల్కి' సెకండ్ పార్ట్ లోనే సుప్రీం యాస్కిన్ రోల్ ఎక్కువ స్క్రీన్ టైం కలిగి ఉంటుందని చెప్పి ఆశ్చర్యపరిచారు. ఒక ఫ్యాన్‌గా ఫస్ట్ పార్ట్‌లో నటించానని అన్నాడు.

ఇకపోతే ఇండియన్‌ సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారని అనడంలో సందేహం లేదు. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ పురాణాలను సైన్స్‌లో మిక్స్ చేసే చాలా డిఫరెంట్ స్టోరీని అల్లాడు. స్టోరీలో ఎలాంటి లాజిక్ మిస్ కాకుండా చూసుకున్నాడు అని కమల్‌ హాసన్ చెప్పుకొచ్చాడు. ఈ కథను చాలా ఓపికగా రాసుకోవడమే కాకుండా చాలా ఓపికగా సినిమాని కూడా తీశాడు అని నాగ్‌ అశ్విన్ పై కమల్‌ హాసన్ ప్రశంసల వర్షం కురిపించారు.

కమల్ హాసన్ ఇటీవల తన కొత్త సినిమా గురించి మాట్లాడుతూ, అంగీకరించడానికి ముందు ఒక సంవత్సరం ఆలోచించినట్లు పేర్కొన్నాడు. కల్కిలో యాస్కిన్‌ పాత్రలో నటించడం తనకు భిన్నమైనదని, ఎందుకంటే తాను చాలా సినిమాల్లో విలన్‌గా నటించానని చెప్పాడు. మొదట విన్నప్పుడు తను చేయగలనా అని సందేహించాడట. నిర్మాత స్వప్నదత్ కూడా కమల్ పాత్ర గురించి మాట్లాడుతూ, యాస్కిన్ పాత్రకు ఎవరిని ఎంచుకోవాలో నిర్ణయించుకోవడానికి చాలా సమయం కేటాయించానని చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: