ఏ రోజు ఎవరిని స్టార్ని చేస్తుందో ఏ చిత్రానికి విజయం అందుతుందో అస్సలు అంచనా వేయలేము. అంచనాలు ఉన్నప్పటికీ కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరుస్తాయి. ఇక ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ని దున్నేస్తాయి. మరి 2024లో ఏ మూవీ ఎలాంటి ఫలితం అందుకుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సర్కారు నౌకరి మూవీ జనవరి ఒకటి తో కొత్త ఏడాదికి స్వాగతం పలికింది. గాయాని సునీత తనయుడు ఆకాష్ హీరోగా పరిచయమైన ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది.

ఇక అనంతరం దీనమ్మ జీవితం, 14 డేస్ లవ్, ప్రేమ కథ, రాఘవ రెడ్డి, డబల్ ఇంజిన్ తదితర చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్దకు వచ్చాయి. కానీ డిస్సప్పాయింట్ ని మిగిల్చాయి. ఏక ఎప్పటిలానే ఈ సంక్రాంతి సీజన్ ను ఆసక్తికర పోటీకి దారి తీసింది. గుంటూరు కారంతో మహేష్ బాబు నా సామిరంగా మూవీతో నాగార్జున.. సైంధవ్ మూవీ తో వెంకటేష్ అండ్ హనుమాన్తో యంగ్ హీరో తేజ బరిలోకి దిగారు. టాలీవుడ్ లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సంక్రాంతి చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచి అరుదైన రికార్డ్ సృష్టించింది హనుమాన్. ఇక ఈ మూవీ కలెక్షన్స్ 3 కోట్లకు పైగానే వచ్చాయి.

అనుభవం ఉన్న డైరెక్టర్ అండ్ అగ్ర నటుడు లేకపోయినా కథా బలం, మౌత్ టాక్ ఎంతటి ప్రభావం చూపుతాయో అర్థం చేసుకోవడానికి ఈ మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్. కలెక్షన్స్ పరంగా ఈ సినిమా తరువాత వరుసగా గుంటూరు కారం అండ్ నా స్వామి రంగా, సైంధవ్ నిలిచాయి. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన ర్యాపిడ్ యాక్షన్ మిషన్, బిఫోర్ మ్యారేజ్ వంటి సినిమాలు ఏ మాత్రం సందడి చేయలేదు. ఇక అనంతరం అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్దకు వచ్చాయి. కానీ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి మూవీతో దీనికి ఎండ్ కార్డ్ పడింది. హనుమాన్ సినిమాతో మొదలై మన రిలీజ్ అయిన కల్కి సినిమాతో ఈ సూపర్ హిట్ కలెక్షన్స్ రికార్డ్ పూర్తయింది. అలా యంగ్ హీరో మొదలు పెడితే మన రెబల్ స్టార్ ఎండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: