టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉంటారు. సంవత్సరానికి ఒకటి అయినా ఆ హీరోల సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇది చాలా కామన్. కానీ చాలా తక్కువ మంది హీరోల సినిమాలకి మాత్రమే మంచి క్రేజ్ ఏర్పడుతూ ఉంటుంది. అటువంటి హీరోలలో ప్రభాస్ కూడా ఒకరు. రెబల్ స్టార్ ప్రభాస్ అనే ట్యాగ్ దక్కించుకునే వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ హీరో. ఇక ఇటీవలే ప్రభాస్ హీరో గా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో లేటెస్ట్ ఫిలిం కల్కి. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ టాక్ అందుకుంటుంది.

ఇక ఈ సినిమాలో దీపిక పదుకొనే అండ్ దిశా పటాని, అమితాబచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ యాక్ట్రెస్ ముఖ్య పాత్రలు పోషించారు. సైన్స్ ఫిక్షన్ మూవీ గా ఇది రూపొందింది. ఇక ఈ మూవీ మొన్న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ అయి ప్రేక్షకులను మరియు అభిమానులని విశేషంగా ఆకట్టుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద తొలి రోజు 191.5 కోట్ల రూపాయలకి పైగా కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఏక ప్రభాస్ ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలకి పైగా డే వన్ కలెక్షన్స్ ఐదు సార్లు రాబట్టిన ఒకే ఒక హీరో. ఇది సెన్సేషన్ రికార్డ అని చెప్పాలి.

ప్రభాస్ హిందీ బాక్సాఫీస్ వద్ద కూడా సెన్సేషన్ రికార్డ్ ఒకటి క్రియేట్ చేశాడు. నాలుగోసారి 20 కోట్ల రూపాయలకు పైగా నెట్ కలెక్షన్స్ రాబట్టిన హీరో ప్రభాస్. కల్తీ చితం హిందీ బాక్సాఫీస్ వద్ద 22.50 కోట్ల రూపాయల కలెక్షన్స్ను రాబట్టడం జరిగింది. ఇక కల్కి మూవీ లాంగ్ రన్ లో భారీ కలెక్షన్స్ను రాబట్టడం ఖాయమని ప్రతి ఒక్కరు ఫిక్స్ అయ్యారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ అండ్ దుల్కర్ సల్మాన్ వంటి యాక్టర్స్ కూడా నటించారు. ప్రజెంట్ మూవీ నెలకొల్పే రికార్డ్స్ ని చూసి ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని కలెక్షన్స్ రాబట్టి ఎన్ని సినిమాలు రికార్డులను బ్రేక్ చేస్తుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: