ఎన్నో అంచనాల మధ్య విడుదలైన కల్కి సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. రివ్యూల్లో రేటింగ్ కూడా బాగానే ఉంది. జనాల మౌత్ టాక్ కూడా బాగానే ఉంది. తొలి రోజే ఈ సినిమా రూ.191 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. అడ్వాన్స్ బుకింగ్స్, నిన్న థియేటర్ల దగ్గర సందడి చూస్తే భారీ వసూళ్లు రావడంలో ఆశ్చర్యమేమీ లేదనిపిస్తోంది. ఐతే ఈ సినిమాకు సోషల్ మీడియాలో లేని మాస్ ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన ఉంది.. వారి అభిప్రాయం  అన్నది మాత్రం షాకింగ్ గా మారింది.పెద్దగా చదువుకోని.. సోషల్ మీడియాలో, మీడియాలో కనిపించని ప్రేక్షకుల సంఖ్య కూడా ఇండియాలో పెద్ద సంఖ్యలోనే ఉంటుంది. ఆ వర్గం ప్రేక్షకులు ఓ సినిమాను ఎలా ఆదరిస్తారన్న దాన్ని బట్టే సినిమా యొక్క అంతిమ ఫలితం ఆధారపడి ఉంటుంది. వారు రిపీటెడ్ గా చూడబట్టే వసూళ్లు పెరుగుతాయి.అయితే 'కల్కి' విషయంలో మాస్ ప్రేక్షకుల నుంచి కొంచెం మిశ్రమ స్పందనే వస్తున్నట్లు కనిపిస్తోంది.


ముఖ్యంగా ఆంధ్రాలో మాస్ ప్రేక్షకులు బాగా ఉన్న సీడెడ్ ఏరియాలో 'కల్కి' వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. మొదటి రోజు 'కల్కి' రేంజ్ మూవీ 10 కోట్ల మార్కును టచ్ చేయాల్సింది. కానీ వసూళ్లు కేవలం 7 కోట్లకు అటు ఇటుగా వచ్చినట్లు తెలుస్తుంది. ఇంకా నిన్న అయితే 5 కోట్లు కూడా దాటలేదు. ఈరోజు పరిస్థితి ఇంకా దారుణం.అంటే 'కల్కి' సినిమా వారిని పూర్తిగా ఎగ్జైట్ చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా మొత్తం గ్రాఫిక్స్ తో హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది. చదువుకొని మాస్ ఆడియన్స్ కి అయితే ఈ సినిమా పెద్దగా నచ్చదు. పైగా ఈ మూవీలో పెద్దగా మాస్ డైలాగులు కూడా లేవు. అలాగే కొంతమేర వర్షాలు కూడా ప్రభావం చూపి ఉండొచ్చు. ఏదీ ఏమైనా కానీ బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాల స్థాయిలో 'కల్కి' మాస్‌ ప్రేక్షకులకు పూర్తి సంతృప్తిని ఇవ్వడం లేదని.. వారికి ఈ కథను అర్థం చేసుకోవడం చాలా కష్టంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీకెండ్ తర్వాత 'కల్కి'కి మాస్ నుంచి రెస్పాన్స్, ఓవరాల్ వసూళ్లు భారీగా తగ్గే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: