ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు నాయుడు పలు రకాల బాధ్యతలను కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కూటమిలో భాగంగా ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో కూడా చెప్పిన హామీలను సైతం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నారు సీఎం చంద్రబాబు.. ముఖ్యంగా గత వైసిపి పాలనలో రాష్ట్రంలోని పరిశ్రమల సైతం తరలిపోయాయి అంటూ పలువురు టిడిపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో కృష్ణపట్నం కంటైనర్ పోర్టు గురించి టిడిపి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది.



వైసిపి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం చాలా నష్టపోయిందని ఈ క్రమంలోనే కృష్ణపట్నం నుంచి కంటైనర్ పోర్టును తరలించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ వార్తలన్నీ కూడా అవాస్తవమే అంటూ టిడిపి ఎమ్మెల్యే సోమిరెడ్డి తెలియజేశారు. ఒకవేళ ఇక్కడి నుంచి కంటైనర్ పోర్టు తరలింపు అయితే దాదాపుగా 10000 మంది ఉపాధి కల్పన కోల్పోతారు అంటూ తెలియజేశారు. ఈ ఘటన పైన ఎన్డీఏ కూటమి ఎంపీలతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేసుకుంటామంటూ తెలిపారు.


ముఖ్యంగా రైతులు ఉద్యోగుల కోసం అవసరమైతే ఆదాని కాళ్లు కూడా పట్టుకోవడానికి తాను సిద్ధమే అంటూ తెలియజేశారు సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.. అయితే కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ కార్యక్రమాలను సైతం యధావిధిగా కొనసాగించాలని అక్కడికి కొంతమంది కార్మిక సంఘాల సైతం డిమాండ్ చేస్తున్నప్పటికీ వారి విషయాన్ని కూడా పరిగణంలోకి తీసుకొని కూటమి ఎంపీలతో కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాస్తాను అంటూ సోమిరెడ్డి తెలియజేశారు. కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అటు టిడిపి బిజెపి జనసేన పార్టీలు పొత్తులో ఉన్నాయి.. మరి పొత్తు మాటలకు బిజెపి పార్టీ కట్టుబడిగా ఉంటుందా లేదా అనే విషయం తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.. ఏది ఏమైనా టిడిపి నేత మాట్లాడిన మాటలు అందరు చేత శభాష్ అనిపించేలా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: