![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/steppmaar-antu-dummuleputunna-first-single-promo73c0c740-8432-46fa-9a54-39a23a3880ca-415x250.jpg)
డబుల్ ఇస్మార్ట్ స్టెప్పా మార్ సాంగ్‌ను జూలై 1న విడుదల చేయనున్నట్లు దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. శివుడి విగ్రహం ముందు రామ్ పోతినేని కంప్లీట్ స్టైలిష్ వైబ్‌లో డ్యాన్స్ చేస్తున్నట్లు ప్రజెంట్ చేసినట్లుగా పోస్టర్ అద్భుతంగా ఉంది.ఇక ఈ సినిమా ఫస్ట్ సింగిల్ పై ఇప్పటికే మంచి బజ్ నెలకొనగా ఇప్పుడు దీని తాలూకా ఫస్ట్ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేశారు. మరి ఇది మాత్రం మరో చార్ట్ బస్టర్ లా అనిపిస్తుంది అని చెప్పాలి. గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఫస్ట్ సింగిల్ ఏ రేంజ్ లో కిక్ ఇచ్చిందో దానికి డబుల్ కిక్ ఇచ్చే బీట్స్ ని మణిశర్మ అందించగా రామ్ మాస్ స్లాంగ్ తో ఈ ప్రోమో అదిరిపోయింది అని చెప్పాలి.ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా, భాస్కర భట్ల లిరిక్స్, అనురాగ్ కులకర్ణి వోకల్స్‌ని అందించారు.ఇదిలా ఉంటే, మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ డబుల్ ఇస్మార్ట్ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ సీనియర్ హీరో, యాక్టర్ సంజయ్ దత్ ఇందులో మెయిన్ విలన్‌గా చేస్తున్నారు. అంటే రామ్ పోతినేనికి దీటైనా విలన్‌గా సంజయ్ దత్ కనిపించనున్నారు. కాగా డబుల్ ఇస్మార్ట్ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో విడుదల కానుంది.
డబుల్ ఇస్మార్ట్ సినిమాలో రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్‌తోపాటు ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ అలీ, జబర్దస్త్ గెటప్ శ్రీను, మకరంద్ దేశ్‌పాండే, షయాజీ షీండే, టెంపర్ శ్రీను, వీజే బని తదితరులు ఇతర పాత్రలు పోషించనున్నారు. కాగా ఇటీవల విడుదల చేసిన డబుల్ ఇస్మార్ట్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.డబుల్ ఇస్మార్ట్ మూవీ టీజర్ ఆద్యంతం ఎంటర్టైనింగ్గా ఉంది. మరోసారి పూరి, రామ్ పోతినేని కాంబో మ్యాజిక్ రిపీట్ కానుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. టీజర్ ప్రారంభం కావడంతోనే గన్స్, బూతులు వినిపిస్తాయి. ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్ శంకర్, నాకు తెల్వకుండానే నాతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తే నా గుడ్డులో కాల్తది అని రామ్ పోతినేని తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్స్ ఆకట్టున్నాయి.