పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా మూవీ కల్కి 2898 AD.గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చాలా గ్రాండ్ గా విడుదలైంది. ఈ మూవీ ఫస్ట్ షో నుంచి అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు 191 కోట్లకి పైగా ఈ సినిమా వసూళ్ళని సాధించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ రెండవ రోజు లెక్కలు కూడా బయటకొచ్చాయి. ఈ మేరకు సినిమా యూనిట్ ఒక అధికారిక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ఇంకా కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను మహానటి సినిమాతో సత్తా చాటిన యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక అటు విమర్శకులతో పాటుగా ప్రేక్షకుల నుండి కూడా పాజిటివ్ రివ్యూస్ పొందిన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 191.50 కోట్ల భారీ వసూళ్లు సాధించగా.. రెండో రోజు కూడా అదే స్పీడ్ ను ఈ సినిమా కొనసాగించింది.


ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా కల్కి 2898 ఏడి సినిమా సాలిడ్ రికార్డులను సృష్టించింది. నిజానికి కల్కి 2898 AD సినిమా గురువారం నాడు విడుదలైంది. ఆయినా కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇలా భారీ రేంజ్ కలెక్షన్స్ సాదించడం అనేది నిజంగా ఓ సూపర్ డూపర్ రికార్డుగానే చెప్పుకోవచ్చు. మొదటి రోజు ఏకంగా 191.50 కోట్ల భారీ వసూళ్లు కొల్లగొట్టిన కల్కి 2898 ఏడి సినిమా రెండో రోజుకి ప్రపంచ వ్యాప్తంగా 298.50 కోట్లని వసూలు చేయడం జరిగింది. ఇంకా రెండు రోజులు వీకెండ్స్ ఉండడంతో ఖచ్చితంగా ఈ సినిమా మరింత వసూళ్లు కొల్లగొట్టే ఛాన్స్ ఉంది. మరి చూడాలి ఈ సినిమా మున్ముందు రోజుల్లో ఇంకెన్ని సాలిడ్ రికార్డులు నమోదు చేస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: