![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/shahrukh-khan-daughter-who-was-caught-cross-talking-with-amitabh-grandson-photos-are-going-viral20c78a5f-5a9a-4951-b4fe-2061a352180c-415x250.jpg)
ఇక తాజాగా ఓ ఇద్దరూ స్టార్ కిడ్స్ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, అమితాబచ్చ న్ మనవడు ఆగస్య డేటింగ్ లో ఉన్నట్లు కొంతకాలం నుంచి పుకార్లు వినిపిస్తున్నాయి. లండన్ నగరంలోని ఓ నైట్ క్లబ్లో వీరిద్దరూ పార్టీలో ఎంజాయ్ చేస్తుండగా.. కెమెరాకు అడ్డంగా చిక్కారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. దీంతో డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం మొదలైంది. ఇక ఇందులో నిజం ఎంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.
అదేవిధంగా పెళ్లి చేసుకుంటారా డేటింగ్ మాత్రమేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా షారుక్ ఖాన్ ఈ మధ్యనే జవాన్ అనే సినిమాతో సంచలనం క్రియేట్ చేశాడు. ఏక ప్రజెంట్ వర్ష సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అదేవిధంగా అమితాబచ్చన్ సైతం తాజాగా విడుదలైన కల్కి సినిమాలో అశ్వద్ధామ పాత్ర పోషించారు. ఇక ఈ సినిమాతో అమితాబచ్చన్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ప్రెసెంట్ బాక్స్ ఆఫీస్ లను షేక్ చేస్తుంది. మరి రానున్న రోజుల్లో వీరి కిడ్స్ డేటింగ్ పై వీరిద్దరూ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. బహుశా వీరిద్దరి పెళ్ళికి ఇరు కుటుంబాలు ఓకే చెబుతాయి. ఎందుకంటే షారుఖ్ ఖాన్ అండ్ అమితాబచ్చన్ చాలా క్లోజ్ గా ఉంటారు.