ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఊసే వినిపిస్తుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన ఏ మూవీస్ ని ప్రేక్షకులనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది. మరీ ముఖ్యంగా ఇందులో చూపించిన విజువల్స్ అండ్ యాక్షన్ మరియు నటీనటుల పాత్రలు అందరిని ఆకట్టుకున్నాయి. అయితే కల్కి సినిమా వరల్డ్ వైడ్గా జూన్ 27న రిలీజ్ అయి హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అదేవిధంగా కలెక్షన్స్ కూడా భారీగానే రాబడుతుంది.

ఇక ఇప్పటికే ఈ మూవీ పై పలువురు సినీ సెలబ్రిటీస్ స్పందిస్తూ రివ్యూ ఇచ్చారు. ఇక తాజాగా టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున కల్కి మూవీ పై రివ్యూ ఇస్తూ తన ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ షేర్ చేసారు. " సూపర్ డూపర్ కల్కి టీం కి అభినందనలు. నాగి మీరు మమ్మల్ని మరక సమయానికి.. మరక ప్రాంతానికి తీసుకెళ్లారు. పురాణాలు అండ్ చరిత్రలను చాలా అద్భుతంగా చూపించారు. అసలైన మాస్ హీరో అమితాబ్ జి.. సార్ మీరు నిప్పులు కురిపిస్తున్నారు‌. సీక్వెల్లో కమల్ జి నీ చూడడానికి ఆగలేను. అతనికి సరిపోలేదు.

ప్రభాస్ నువ్వు మళ్ళీ చేసావు. దీపిక మీరు దివ్యమైన తల్లిలా చాలా అద్భుతంగా కనిపించింది. ఇక మిగిలిన టీం అశ్విని దత్ గారు, ప్రియమైన స్వీటీ, స్వప్న, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇండియన్ సినిమా మళ్లీ అద్భుతం చేసింది " అంటూ ఆత్మీట్లో పేర్కొన్నాడు నాగార్జున. ప్రజెంట్ నాగార్జున స్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ట్వీట్ చూసిన వారంతా నాగ మామ మాటలకి ఫిదా అవుతున్నారు. ఇక ఇటీవలే నా స్వామి రంగా సినిమాతో ప్రేక్షకులం ముందుకి వచ్చిన నాగార్జున సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ప్రజెంట్ ధనుష్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడినప్పటికీ యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు నాగార్జున.

మరింత సమాచారం తెలుసుకోండి: