పవన్ కళ్యాణ్ ప్రకటించిన సినిమాలలో హరిహర వీరమల్లు కూడా ఒకటి. ఏ ఎమ్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకం పై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఇకపోతే కొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల షూటింగ్ కాస్త ఆలస్యం అవుతోంది.. మరొకవైపు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనను గెలిపించడంతోపాటు ఏకంగా ఆయన ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.. ఈ నేపథ్యంలోనే ఎక్కువ సమయం ప్రజా సమస్యల పరిష్కారానికి కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.. దీంతో హరిహర వీరమల్లు సెట్స్ లోకి తిరిగి ఎప్పుడు అడుగుపెడతారు..? సినిమా ఇంకా ఎంత భాగం షూటింగ్ మిగిలి ఉంది..? అన్న ప్రశ్నలు అభిమానులను వెంటాడుతున్నాయి.. ఈ విషయంపై తాజాగా నిర్మాత ఏ.యం.రత్నం క్లారిటీ ఇచ్చారు.


ఏ.యం.రత్నం మాట్లాడుతూ.. సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ మేజర్ పార్ట్ అంతా పూర్తయింది.. ఇంకో 25 రోజులు సమయం కేటాయిస్తే మిగతా షూటింగ్ కూడా అయిపోతుంది.. పవన్ బిజీ షెడ్యూల్ ని దృష్టిలో పెట్టుకొని ప్రణాళికను సిద్ధం చేస్తాము... ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ అమెజాన్ కొనుగోలు చేసింది. ఈ సినిమాను డిసెంబర్ చివరి నాటికి విడుదల చేసేందుకు ప్రయత్నం చేస్తాము.. మరోవైపు సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.. ఇప్పటికే మచిలీపట్నం సీక్వెన్స్ సంబంధించి సీసీ వర్క్ ఇరాన్ లో జరుగుతూ ఉండగా.. కుస్తీ పోటీలకు సంబంధించిన  వీ ఎఫ్ ఎక్స్ పనులు బెంగళూరులో జరుగుతున్నాయి.. అంతేకాదు చార్మినార్ ఎపిసోడ్ పనులు హైదరాబాదులో జరుగుతున్నాయి.. కచ్చితంగా హరిహర వీరమల్లు ప్రేక్షకుడికి ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది అంటూ ఆయన తెలిపారు..

ముఖ్యంగా ఈ సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు సినిమాకి హైలెట్ గా ఉన్నాయని స్పష్టం చేశారు .. ఇక సాధ్యమైనంత వరకు హరిహర వీరమ్మల్లు సినిమాకి పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయించేలా ప్లాన్ చేస్తామని తెలిపారు..  ఆగస్టు నెలలో వెసులుబాటు కల్పించుకొని సినిమా కోసం రంగంలోకి పవన్ దిగుతారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి..  మరి ఏ మేరకు ఈ సినిమా డిసెంబర్ నాటికి విడుదలవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: