బాక్స్ ఆఫీస్ ని ఊచకోతకోస్తున్న కల్కి హిందీ వెర్షన్? 

పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా మూవీ కల్కి 2898 AD.గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చాలా గ్రాండ్ గా విడుదలైంది. ఈ మూవీ ఫస్ట్ షో నుంచి అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు 191 కోట్లకి పైగా ఈ సినిమా వసూళ్ళని సాధించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ రెండవ రోజు లెక్కలు కూడా బయటకొచ్చాయి. ఈ మేరకు సినిమా యూనిట్ ఒక అధికారిక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ఇంకా కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను మహానటి సినిమాతో సత్తా చాటిన యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. 


ఇక అటు విమర్శకులతో పాటుగా ప్రేక్షకుల నుండి కూడా పాజిటివ్ రివ్యూస్ పొందిన ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 191.50 కోట్ల భారీ వసూళ్లు సాధించగా రెండో రోజుకి ప్రపంచ వ్యాప్తంగా 298.50 కోట్లని వసూలు చేయడం జరిగింది. బాలీవుడ్ లో కల్కి రూ.20 కోట్ల పైగా ఓపెనింగ్స్ సాధించింది. రెండో రోజు కూడా అదే రేంజ్ లో వసూళ్లు రాబట్టింది. మొదటి రెండు రోజులు కలిపి రూ.41 కోట్ల పైగా కలెక్షన్లు వసూలు చేసింది. దీని బట్టి చూస్తే.. కల్కి రెండో రోజు కూడా నార్త్ లో మంచి వసూళ్లు అందుకున్నట్లే. తొలి రోజు కన్నా రెండో రోజు కల్కి సినిమాకు 20 శాతం థియేటర్ల ఆక్యుపెన్సీ తగ్గుతుందని వార్తలు వినిపించాయి.కానీ అలా జరగలేదు. కల్కి ఊహించిన దానికంటే బాగానే ఆడుతోంది. ఇక శనివారం మరో రూ.22 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇంకా బాలీవుడ్ లో జోరు చూస్తుంటే కల్కికి ఆదివారం రూ.30 కోట్లకుపైగా వసూళ్లు రావొచ్చని అంచనాలు ఉన్నాయి. వీకెండ్ ముగిసేసరికి రూ.90 కోట్లకు చేరుకుంటుందని అంచనా. అలా హిందీలో కల్కి రిమార్కబుల్ లాంగ్ రన్ ను అందుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: