కల్కి ఎఫెక్ట్: ట్రెండింగ్లో రాజమౌళి మహా భారతం? 

కల్కి 2898 AD గురువారం నాడు ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలైంది. ఈ మూవీ ఫస్ట్ షో నుంచి అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు 191 కోట్లకి పైగా ఈ సినిమా వసూళ్ళని సాధించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ రెండవ రోజు లెక్కలు కూడా బయటకొచ్చాయి. ఈ మేరకు సినిమా యూనిట్ ఒక అధికారిక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ఇంకా కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను మహానటి సినిమాతో సత్తా చాటిన యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక అటు విమర్శకులతో పాటుగా ప్రేక్షకుల నుండి కూడా పాజిటివ్ రివ్యూస్ పొందిన ఈ సినిమా రెండ్రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 298.50 కోట్లని వసూలు చేయడం జరిగింది. మహాభారత పాత్రలను తీసుకొని నాగ్ అశ్విన్ కథ అల్లుకున్న తీరు, వాళ్లను చూపించిన విధానానికి అంతా ఆశ్చర్యపోతున్నారు. 


అశ్వాద్దామ, కృష్ణుడు, కర్ణుడు, అర్జునుడు క్యారెక్టర్స్ను ఆయన మలిచిన తీరుకు వావ్ అంటున్నారు. ఇంకా పార్ట్ 2 లో దుల్కర్ సల్మాన్ పరశురాముడి రోల్ ప్లే చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో మహా భారతం హాట్ టాపిక్ అవుతుంది.అయితే ఇదిలా ఉంటే, రాజమౌళి 'మహాభారతం' తీస్తే ఇంకెలా ఉంటుందో అని కామెంట్లు వస్తున్నాయి.ఎందుకంటే 'మహా భారతం' తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు. ఎప్పటికైనా ఈ ఎపిక్ డ్రామాని బిగ్ స్క్రీన్ మీదకు తీసుకొస్తానని చెబుతూ వస్తున్నారు. దీని కోసం 'బాహుబలి' కంటే పది రెట్లు ఎక్కువగా కష్టపడాలని, సినిమా తీయడానికి పదేళ్ల సమయం పడుతుందని ట్రిపుల్ ఆర్ టైంలో అన్నారు. అయితే ఇప్పుడు 'కల్కి 2898 AD' విడుదలైన తర్వాత, జక్కన్న వీలైనంత త్వరగా మహాభారతాన్ని తెర పైకి తీసుకురావాలని సినీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.ప్రస్తుతం టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'SSMB 29' మూవీని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. దీని తర్వాత రాజమౌళి 'మహాభారతం' ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: