తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి అల్లరి నరేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో కామెడీ ఓరియంటెడ్ సినిమాలలో , వైవిధ్యమైన సినిమాలలో నటించి నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేక ఈమేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే సుడిగాడు మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ నటుడికి ఆ తర్వాత నటించిన ఏ కామెడీ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందించలేదు. దానితో ఈయన రూట్ మార్చి ప్రస్తుతం వైవిధ్యమైన సినిమాలతో ఎక్కువగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఆఖరుగా అల్లరి నరేష్ "ఆ ఒక్కటి అడక్కు" అనే సినిమాలో హీరోగా నటించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా నరేష్ కి నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం ఈయన బచ్చల మళ్ళీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీలో కూడా నరేష్ వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి మేకర్స్ కొన్ని పోస్టర్ లను విడుదల చేయగా అవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇక ఈ మూవీ బృందం వారు రేపు అల్లరి నరేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి గ్లిమ్స్ వీడియోను ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

ఇక ఈ పోస్టర్ చూస్తుంటే పుష్ప మూవీ లో అల్లు అర్జున్ లుక్ మాదిరి అల్లరి నరేష్ ఉన్నాడు. గుబురు గడ్డంలో ఉర మాస్  మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక ఈ పోస్టర్లో ఒకే చేతిలో గ్లాస్ పట్టుకొని అదే చేతితో మంది పోసుకుంటూ అదిరిపోయే స్టైలిష్ లో అల్లరి నరేష్ ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా పోస్టర్ చూస్తూ ఉంటే పుష్ప మూవీకి దగ్గరగా అనిపిస్తుంది. మరి ఈ సినిమాతో నరేష్ కూడా ఆ స్థాయి విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: