![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/prabhasba6185b5-e6b8-4c84-aa36-7d4756cb37a2-415x250.jpg)
కొంత కాలం క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 31.63 కోట్ల షేర్ కలక్షన్లు వచ్చాయి. ఈ మూవీ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన రెండవ రోజు అత్యధిక షేర్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలు లిస్టులో మొదటి స్థానంలో ఉంది.
ప్రభాస్ పోయిన సంవత్సరం సలార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పోయిన సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఈ మూవీ కి విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 21.23 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి. దానితో ఈ సినిమా విడుదల అయిన రెండవ రోజు అత్యధిక షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన సినిమాల లిస్టులో రెండవ స్థానంలో ఉంది.
ఇక ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి మూవీ విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల షేర్ కలక్షన్లను రాబట్టింది. దానితో ఈ మూవీ విడుదల అయిన రెండవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ కలక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో మూడవ స్థానంలో నిలిచింది.