![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/balaya-family-daughters-5dd92e23-c24c-44fd-8bb1-5047de7f33c9-415x250.jpg)
మోక్షజ్ఞ తన ఎంట్రీ కోసం ప్రస్తుతం చాలా స్టైలిష్ గా కూడా మారిపోయారు. సరైన కథ పడితే తన తొలి సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకుంటారని చెప్పవచ్చు. బాలయ్య కెరియర్ లోనే బెస్ట్ చిత్రమైన ఆదిత్య 369 ఆదిత్య-999 చిత్రంతో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందనే విధంగా వార్తలు వినిపించాయి. తానే డైరెక్టర్గా బాధ్యతలు తీసుకుంటారని కూడా ఆ మధ్య తెలియచేసిన మళ్లీ మాట్లాడలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఇక్కడే బాలయ్యకు ఒక సమస్యగా మారింది. అదేమిటంటే ఈ చిత్రాన్ని నిర్మించడానికి బాలయ్య ఇద్దరు కుమార్తెలు నారా బ్రాహ్మణి ,తేజస్విని సైతం పోటీ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని ముందు నుంచి సినిమాలు అంటే కాస్త మక్కువ ఎక్కువ.. అందుకే మోక్షజ్ఞ సినిమాలు నిర్మించాలని పట్టుదలతో ఉన్నదట. మరొక పక్కన నారా బ్రాహ్మణి కూడా మోక్షజ్ఞ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఇద్దరి కూతుర్ల మధ్య బాలయ్య నలిగిపోతున్నారు.. ఈ విషయం తెలిసి బాలయ్య అభిమానులు కూడా ఫన్నీ గానే కామెంట్స్ చేస్తున్నారు.