కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అల్లరి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన నరేష్ కామెడీ సినిమాలతో ఎంతగానో పాపులర్ అయ్యారు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.. అయితే గత కొంతకాలంగా అల్లరినరేష్ నటిస్తున్న కామెడీ సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోతున్నాయి. దీనితో అల్లరి నరేష్ రూటు మార్చి మాస్ అండ్ యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. తాను నటించిన నాంది, ఉగ్రం సినిమాలు ఆ జోనర్ లో తెరకెక్కినవే. ఆ రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.అప్పటి వరకు కామెడీతో ఎంతగానో అలరించిన నరేష్ యాక్టింగ్ స్కోప్ వున్న పాత్రలలో నటించి ఎంతగానో మెప్పించాడు..

అల్లరి నరేష్ ఈ ఏడాది నాగార్జున హీరోగా తెరకెక్కిన “ నా సామి రంగ “ సినిమాలో అంజి అనే పాత్రలో కనిపించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా అల్లరి నరేష్ నటించిన మూవీ “ ఆ ఒక్కటి అడక్కు “. మల్లి అంకం తెరకెక్కించిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం అల్లరి నటిస్తున్న లేటెస్ట్ మూవీ “ “బచ్చల మల్లి”.. సుబ్బు మంగాదేవి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది.విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే నేడు అల్లరి నరేష్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ నరేష్ బర్త్ డే విషెస్ చెబుతూ ఈ సినిమా నుండి అద్భుతమైన గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్సెలో “ఎవడికోసం తగ్గాలి ఎందుకు తగ్గాలి “ అనే డైలాగ్ తో నరేష్ ఎంతగానో ఆకట్టుకున్నాడు.. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: