తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి క్రేజ్ కలిగిన వారిలో శేఖర్ కమ్ముల ఒకరు. ఈయన రాజా హీరోగా రూపొందిన ఆనంద్ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకొని దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈయన గోదావరి , హ్యాపీ డేస్ లాంటి వరుస విజయాలతో తెలుగులో టాప్ దర్శకుల స్థాయికి వెళ్లిపోయాడు. ఇక ఈయన ఇప్పటి వరకు తన కెరీర్ లో దర్శకత్వం వహించిన సినిమాలలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ , లీడర్ , అనామిక  మూడు సినిమాలే కాస్త ప్రేక్షకులను నిరోత్సాహ పరిచాయి. 

ఇక ఇందులో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కూడా హ్యాపీ డేస్ మూవీ కి దగ్గరగా ఉండటం వల్ల కాస్త నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. కానీ ఓవరాల్ గా చూసినట్లు అయితే ఈ సినిమాను ఇష్టపడే జనాలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అలాగే లీడర్ సినిమాను కూడా ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఈ విధంగా చూసుకుంటే శేఖర్ దర్శకత్వంలో రూపొందిన అనామిక సినిమానే పెద్ద స్థాయిలో ప్రేక్షకులను నిరుత్సాహ పరిచింది. మరి శేఖర్ కొంత కాలం క్రితం ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

అందులో భాగంగా అనామిక సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా శేఖర్ మాట్లాడుతూ ... హిందీలో అద్భుతమైన విజయం సాధించిన సినిమాని తెలుగు లో అనామిక పేరుతో రీమిక్ చేశాను. నిజానికి నేను ఆ సినిమా రీమేక్ చేసి ఉండకూడదు. ఆ సమయంలో నిర్భయ కేస్ ఘటన వల్ల ఇలాంటి సినిమాను రీమిక్ చేయాలి అనుకున్నాను. కానీ అది పెద్ద స్థాయి అపజయాన్ని అందుకుంది అని శేఖర్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే అనామిక మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయన తార ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ లేడీ ఓరియంటెడ్ మూవీ గా రూపొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: