హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కెరీర్ను కొనసాగిస్తున్న కత్రినా కైఫ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కెరియర్ ప్రారంభంలో తెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటించింది. తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన మల్లీశ్వరి  నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన అల్లరి పిడుగు సినిమాలలో ఈ బ్యూటీ నటించి తెలుగు ప్రేక్షకులను కూడా బాగానే ఆదరించింది. ఇకపోతే ఈమె చాలా సంవత్సరాలుగా హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్గా కెరీర్ ను కొనసాగిస్తుంది.

ఆఖరుగా ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన టైగర్ 3 అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితమే విక్కీ కౌశల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరి జీవితం ఎంతో ఆనందంగా ముందుకు సాగుతుంది. ఇకపోతే కొంత కాలం క్రితం వీరిద్దరూ లండన్ వీధుల్లో తిరుగుతున్న ఒక ఫోటో బయటకు వచ్చింది. ఆ ఫోటో పెద్దగా క్లారిటీ లేకపోవడం, అందులో కత్రినా కడుపు కాస్త పెద్దదిగా కనిపించడంతో ఆమె ప్రస్తుతం గర్భం దాల్చింది.

మరికొన్ని రోజుల్లోనే డెలివరీ కాబోతుంది. ఆ డెలివరీ కోసమే ఆమెను తన భర్త లండన్ కి తీసుకువెళ్లాడు. అక్కడ డెలివరీ అయిన తర్వాత పుట్టిన బిడ్డను తీసుకొని ఇండియాకు వస్తారు అని ఒక వార్త వైరల్ అయింది. ఇక వారు లండన్ నుంచి తిరిగి వచ్చే టైంలో ఎయిర్ పోర్ట్ లో కత్రినా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. అందులో ఆమెకు ఏ మాత్రం పొట్ట లేదు. దానితో ఆమె ప్రెగ్నెంట్ కాదు అనే విషయం క్లారిటీ వచ్చేసింది. ఇక తాజాగా విక్కీ కౌశల్ ఈ వార్తలపై స్పందించాడు... కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ శుభ ఘడియలు ఎప్పుడు వచ్చినా అందరికీ చెబుతాను. మేము దానిని ప్రకటించడానికి ఏమాత్రం సిగ్గుపడము అని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vk