అగ్ర నటుడు క‌మ‌ల్ హాస‌న్ వ‌రుస‌గా భారీ ప్రాజెక్ట్‌లలో ప్రేక్షకుల్ని అలరిస్తున్న సంగ‌తి విదితమే. `కల్కి 2898 AD`లో క‌మ‌ల్ పోషించిన పాత్ర‌కు అద్భుత రెస్పాన్స్ వస్తోంది. మొదటి భాగంలో ఆయన నిడివి తక్కువ ఉన్నప్పటికీ కనబడిన ఆ కొద్దిసేపే ఆయన మనల్ని మెస్మరైజ్ చేసారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక క‌ల్కి పార్ట్ 2లో క‌మ‌ల్ హాస‌న్ విశ్వ‌రూపం చూపిస్తాడు అని దర్శకుడు నాగ్ అశ్విన్ మనకు చెప్పకనే చెప్పేశాడు. అవును, ప్రస్తుతం కల్కి 2898 AD బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తోంది. ఇంత‌లోనే కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 (తెలుగులో భారతీయుడు 2) సినిమా విడుద‌లకి సిద్ధం కావడానికి రెడీ అయిపోయింది.

ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. తాజాగా పింక్‌విల్లాతో ఇంటరాక్టివ్ మాస్టర్‌క్లాస్ సెషన్ లో ఒక ప్ర‌శ్న‌కు క‌మ‌ల్ గమ్మత్తైన సమాధానం చెప్పి అందరినీ నవ్వించారు. విషయం ఏమిటంటే... ఇండియన్-2లో సేనాపతి అసలు వయస్సు ఎంత? అనేదాని గురించి ఆయనిని ప్రశ్నించగా `సూపర్‌మ్యాన్ లేదా హనుమాన్ వంటివారికి వయస్సు ఎంత అని అడిగితే ఏమని చెబుతారు?` అని అన్నారు. దాంతో అందరూ చెప్పలేమన్నట్టు నవ్వేశారు. ఇకపోతే ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాని సుభాస్కరన్ అల్లిరాజా సార‌థ్యంలోని లైకా ప్రొడక్షన్స్ బేనర్ అన్ని భాషల్లో విడుదల చేస్తోంది. కాగా ఈ చిత్రం దేశమంతటా తమిళం, తెలుగు, హిందీ భాషలలో 12 జూలై 2024న థియేటర్లలో విడుదల కానుంది.

ఇకపోతే ఈ ఇంట‌ర్వ్యూ ముగింపులో క‌మ‌ల్ వాడిన డైలాగ్ ఇపుడు అభిమానులు షేర్ చేస్తున్నారు. "అతను ప్రతిచోటా ఉంటాడు.. యుగాలు దాటి వస్తాడు.. అందుకే మీరు అతన్ని దేవుడివలె ఎక్కువ కాలం జీవించేవాడిగా చూస్తారు!" అని చెబుతూ ఇంట‌ర్వ్యూ ముగించారు. ఇక ఇండియన్-2 1996లో విడుదలైన భారతీయుడు చిత్రానికి కొనసాగింపు లేదా డిఫరెంట్ కాన్సెప్ట్ అని అనుకోవచ్చు. ఈ సినిమాలో అప్పుడు కమల్ హాసన్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయడం జరిగింది. తండ్రి తన దేశంలో అవినీతిని ఎదిరించేవాడిగా విప్లవకారుడిగా కనిపించాడు. ఇండియన్ 2 దానికి మునుపు ఏం జ‌రిగింద‌నేది తెర‌పై ఆవిష్క‌రిస్తుంది. ఇది ప్రీక్వెల్ క‌థ‌తో రూపొందిన ఆశ్చర్య పడనక్కర్లేదు. ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య, బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్ త‌దిత‌రులు న‌టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: