స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ సినిమా భారతీయుడు 2. ఈ సినిమా జూలై 2న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. దాదాపుగా 28 సంవత్సరాల తర్వాత శంకర్ భారతీయుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ భారీ రెస్పాన్స్ అందుకుంది. కాగా ఇందులో భారతీయుడు పాత్రలో కమల్ హాసన్ కనిపించబోతున్నాడు. ఇందులో ఆయన చేసే విన్యాసాలు అత్యద్భుతంగా ఉండబోతున్నాయి. దీంతో స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన   ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ ఆడియన్స్. 

ఇదిలా ఉంటే భారతీయుడు టు సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో దీనికి సంబంధించిన ప్రమోషన్స్ సైతం స్టార్ట్ చేశారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే కమలహాసన్ భారతీయుడు త్రీ కి సంబంధించిన విషయాలను కూడా రివీల్ చేసేసాడు. అలా ప్రస్తుతం ఆయన చేసిన పలు కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. భారతీయుడు 3లో మరో కమల్ హాసన్ వస్తాడట. డైరెక్టర్ శంకర్ స్వాతంత్ర ఉద్యమం సమయంలో జరిగిన సంఘటనలని భారతీయుడు 3లో చూపించబోతున్నారు అని కమల్ హాసన్ అన్నారు.

  అసలే 106 ఏళ్ళ సేనాపతి ఆ విధంగా ఫైట్స్ చేస్తే ఎలా నమ్మాలి అని డిబేట్ సాగుతోంది. ఇప్పుడు భారతీయుడు 3లో సేనాపతి తండ్రిని చూపిస్తారట. సేనాపతికి తన తండ్రి నుంచి మర్మ కళ వచ్చింది. సేనాపతి స్వాతంత్ర ఉద్యమం చేసి భారతీయుడిగా మారారు.  అతడి తండ్రి కూడా స్వాతంత్ర ఉద్యమం చేసినట్లు భారతీయుడు 3లో శంకర్ చూపించబోతున్నారు. అంతేకాదు భారతీయుడు త్రీ లో కూడా ఇప్పుడున్న సమయంలో కాకుండా బ్రిటిష్ కాలంలో ఎలా ఉండేది అప్పుడు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు అన్న చాలా సన్నివేశాలను చూపించబోతున్నారట. అలా ప్రస్తుతం కమలహాసన్ చేసిన ఈ కామెంట్లో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: