ప్రభాస్ హీరోగా రూపొందిన కల్కి 2898 AD సినిమా జూన్ 27 వ తేదీన విడుదల అయ్యి ఇప్పటి వరకు మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇక మూడు రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. మొదటి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 44.39 కోట్ల షేర్ కలక్షన్లను రాబట్టింది. ఇక రెండవ రోజు హాలిడే కాకపోవడం వల్ల ఈ సినిమాకు కలెక్షన్లు కాస్త తగ్గినా కానీ మంచి కలెక్షన్లనే రెండవ రోజు కూడా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది. రెండవ రోజు ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 19.38 కోట్ల షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఇక మూడవ రోజు ఈ సినిమాకు 19.78 కోట్ల షేర్ కలెక్షన్ వచ్చాయి. మూడవ రోజు ఈ సినిమాకు ఏ ఏరియా లో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అని తెలుసు కుందాం.

మూడవ రోజు ఈ మూవీ కి నైజాం ఏరియాలో 10.60 కోట్ల కలెక్షన్లు రాగా , సీడెడ్ ఏరియాలో 2.35 కోట్లు , ఉత్తరాంధ్ర ఏరియాలో 2.1 కోట్లు , ఈస్ట్ లో 1.06 కోట్లు , వెస్ట్ లో 77 లక్షలు , గుంటూరు లో 1.18 కోట్లు , కృష్ణ లో 1.18 కోట్లు , నెల్లూరు లో 54 లక్షల కలెక్షన్లు వచ్చాయి. ఇక మొత్తంగా మూడు రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 83.55 కోట్ల షేర్ కలక్షన్లు వచ్చాయి. ఇక ఈ మూవీ కి ఈ రోజు అనగా ఆదివారం కూడా అద్భుతమైన కలెక్షన్లు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. మరి సోమవారం నుండి ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర రియల్ టెస్ట్ మొదలు కానుంది. సోమవారం ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చినట్లు అయితే ఈ మూవీ చాలా రోజులు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను వసూలు చేసే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: