కల్కి 2898 AD ఫస్ట్ షో నుంచి అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ సినిమా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. రెండ్రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 298.50 కోట్లని వసూలు చేయడం జరిగింది. మహాభారత పాత్రలను తీసుకొని నాగ్ అశ్విన్ కథ అల్లుకున్న తీరు, వాళ్లను చూపించిన విధానానికి అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో యూనివర్సల్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ బిగ్ బాస్ అమితాబ్ బచ్చన్, నటి దీపికా పడుకోన్ ఇంకా దిశా పఠాని లు ముఖ్య పాత్రల్లో నటించారు.ఈ సినిమాకి ఇండియా వైడ్ సెన్సేషనల్ క్రేజ్ నెలకొనగా ఈ క్రేజ్ తో  ఇండియా వైడ్ భారీ భారీ బుకింగ్స్ ని ప్రీ సేల్స్ నుంచే ఈ చిత్రానికి వచ్చాయి. అలా ఇప్పుడు సినిమా బుకింగ్స్ విషయంలో ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ సినిమా కూడా అందుకోని అరుదైన రికార్డు కొట్టినట్టుగా తెలుస్తుంది.


గడిచిన 24 గంటల్లో కల్కి సినిమాకి బుక్ మై షో లో ఏకంగా 1.28 మిలియన్ టికెట్స్ అమ్ముడుపోయాయని సమాచారం తెలుస్తుంది.నిజంగా ఇదొక సంచలనం అని చెప్పాలి. ఒక్క రోజులో 12 లక్షలకి పైగా బుకింగ్స్ ఒక సినిమాకి జరగడం అనేది ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటివరకు జరగలేదు. మొదటిసారి కల్కి సినిమాకి ఇలా జరగడం హిస్టరీగా మారింది. మరి మున్ముందు కల్కి సినిమా ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.మహాభారత పాత్రలను తీసుకొని నాగ్ అశ్విన్ కథ అల్లుకున్న తీరు, వాళ్లను చూపించిన విధానానికి అంతా ఆశ్చర్యపోతున్నారు. అశ్వాద్దామ, కృష్ణుడు, కర్ణుడు, అర్జునుడు క్యారెక్టర్స్ను ఆయన మలిచిన తీరుకు వావ్ అంటున్నారు. ఇంకా పార్ట్ 2 లో దుల్కర్ సల్మాన్ పరశురాముడి రోల్ ప్లే చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో మహా భారతం హాట్ టాపిక్ అవుతుంది.అయితే ఈ సినిమాలో ప్రభాస్ చేసిన భైరవ పాత్ర నెగిటివ్ షేడ్స్ లో నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: