టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండియా వైడ్ గా గుర్తింపు సంపాదించుకున్న ఈమె కెరియర్ బిగినింగ్ నుండి ఇప్పటి వరకు వరుస సినిమాలను చేస్తూ దూసుకుపోతోంది. దాదాపుగా 14 సంవత్సరాల నుండి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతోంది. ఇప్పటివరకు దాదాపుగా అన్ని జానర్ ల సినిమాలు చేసింది ఈ బ్యూటీ. ఇక సమంత నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు సైతం భారీ విజయాలను అందుకున్నాయి. అలా చేసిన సినిమాల్లో యూ టర్న్ బేబీ భారీ హిట్

 అందుకున్నాయి. ఇక ఓ బేబీ సినిమా అయితే యు ఎస్ లో వన్ మిలియన్ మార్క్ చేరుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఎందరో స్టార్ హీరోల సరసన ఆడి పాడింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు డిజిటల్ సిరీస్లలో కూడా నటించింది. అలా సమంత నటించిన ది ఫ్యామిలీ మెన్ టు భారీ విజయాన్ని అందుకుంది. శ్రీలంక తమిళ్ రెబల్గా సమంత ఇందులో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక పాత్రలో నటించింది. అయితే తాజాగా సమంతకి మరో భారీ అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది. రాజ్ అండ్ డీకే సమంతకూ సిటాడే వెబ్ సిరీస్ లో మరొక

 అదిరిపోయే ఛాన్స్ ఇచ్చినట్లుగా సమాచారం. అయితే  ముచ్చటగా మూడోసారి రాజ్ అండ్ డీకే హీరోయిన్ సమంతకు ఆఫర్ ఇచ్చారని సమాచారం. రాజ్ అండ్ డీకే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సిరీస్లో ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా నటిస్తుండగా సమంత హీరోయిన్ అట. ఆగస్టు నుండి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సిరీస్ కి 'రక్తబీజ్' అనే టైటిల్ నిర్ణయించారట. త్వరలో అధికారిక సమాచారం రానుండగా... ఆల్రెడీ సమంత ప్రిపరేషన్ స్టార్ట్ చేసిందట. ఆమె మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్నారట. ఈ సిరీస్ సమంత కెరీర్ కి మరింత బూస్ట్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు. ఫ్యూచర్ డిజిటల్ కంటెంట్ దే. భవిష్యత్ లో స్టార్ హీరోలు కూడా సిరీస్లు, ఒరిజినల్స్ చేయక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: