![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/do-you-remember-uday-kiran-friend-in-the-movie-nee-sneha-now-see-how-he-has-changedb2150493-211c-44fb-b47b-f80f7607e1a0-415x250.jpg)
స్నేహితుడు కోసం ప్రేమను వదులుకునే కుర్రాడి పాత్రలో కనిపించాడు ఉదయ్ కిరణ్. ఇక ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్ అండ్ విశ్వనాథ్ కీలక పాత్రలు పోషించారు. 2002 నవంబర్ ఒకటవ తేదీన ఈ చిత్రం విడుదలై భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీలో ఉదయ్ కిరణ్ స్నేహితుడిగా నటించిన నటుడు పేరు జాతిన్. ప్రాణ స్నేహితుడిగా ఉన్న వీరిద్దరి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించాయి. ఇక ఈ మూవీ తరువాత తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన జతిన్ ఆ తరువాత మరో సినిమాలో కనిపించలేదు.
ముంబైలో జన్మించిన జతిన్ మోడల్‌గా కెరీర్ ప్రారంభించారు. ఇక అనంతరం పలు ప్రైవేట్ ఆల్బమ్స్ అండ్ హిందీ మూవీస్ చేసి తనకంటూ గుర్తింపును ఏర్పరచుకున్నారు. అలాగే పలు టీవీ కార్యక్రమాలలోనూ కనిపించాడు. హిందీ తో పాటు తెలుగు అండ్ పంజాబీ చిత్రాల్లో నటించిన జాతిన్ ఎక్కువగా నీ స్నేహం సినిమాతోనే క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక 2010లో కరోలినా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు సైతం జన్మించారు. ప్రజెంట్ సినిమాలకు దూరంగా ఉంటూ జతన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు. ఫ్యామిలీతో ఉన్న ఫోటోలు ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.