రీసెంట్ కాలంలో చాలా తక్కువ సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. అదేవిధంగా చాలా తక్కువ సినిమాలు హిట్ అయ్యాయి కూడా. హిట్ అయిన సినిమాలని వేలల్లో లెక్క పెట్టుకోవచ్చు. ఇక ఫ్లాప్ అయిన సినిమాలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇదిలా ఉంటే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దిశ పటాని అండ్ దీపికా పదుకొనే హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ ఫిలిం కల్కి థియేటర్లో రిలీజ్ అయింది. జూన్ 27వ తేదీన బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసేందుకు వచ్చినా ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకోండి.

ఇక ఈ చిత్రం కోసం అభిమానులు రిలీజ్ కి ముందు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. ఇక రిలీజ్ అనంతరం వారి అంచనాలను ఈ మూవీ అందుకుందనే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది ఈ సినిమా. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అదరగొడుతున్న కల్కి మూవీ యు ఎస్ మార్కెట్లో అయితే రికార్డులు తిరగరాస్తుంది. ఇంకా వీకెండ్ పూర్తి కాకుండానే నార్త్ అమెరికాలో 10 మిలియన్ డాలర్స్ మార్క్ దిశగా కల్కి దూసుకెళ్తుంది. జస్ట్ లేటెస్ట్ గానే ఈ మూవీ 9 మిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేయగా నెక్స్ట్ స్టెప్ 10 మిలియన్ మార్క్ అనే చెప్పాలి.

దీంతో యూఎస్ మార్కెట్లో కల్కి మ్యానియా ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక లాంగ్ రాన్లో ఈ మూవీ ఆ ఏరియాలో అదరగొడుతుంది అనే అంచనాలు ప్రెసెంట్ కన్ఫర్మ్ అయ్యాయి. ఇక ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబచ్చన్ వంటి దిగ్గజా యాక్ట్రెస్ నటించారు. సంతోష్ నారాయణ సంగీతం అందించిన ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఈ సినిమా దాదాపు 600 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: