పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 AD “ వంటి   బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ సినిమాను తెరకెక్కించాడు.. ఈ సినిమా జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపీకా పదుకోన్, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండ్రి యాక్టర్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు.భారీ హైప్ తో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. గ్రాండ్ విజువల్స్ తో దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక అద్భుత లోకాన్ని సృష్టించాడని ప్రేక్షకులు తెలిపారు. ప్రభాస్, అమితాబ్ మధ్య వచ్చే ఫైట్ సీన్స్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చాయి. ఇదిలా ఉంటే కల్కి సినిమాతో వెండితెర మీద మరోసారి మహాభారతం హాట్ టాపిక్ గా మారింది. కల్కి సినిమా టైటిల్ కార్డ్స్ తో పాటుగా చివరి క్లైమాక్స్ లో మహాభారత ఘట్టాలను దర్శకుడు నాగ్ అశ్విన్ చూపించారు.సినిమా చివరి 20 నిమిషాల మహాభారత ఎపిసోడ్స్ తో నాగ్ అశ్విన్ గూస్ బంప్స్ తెప్పించాడు.

ఇక మహాభారతం మొత్తం తెర మీద ఆవిష్కరిస్తే మాత్రం వేరే లెవెల్ లో ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు కల్కి పార్ట్ 2 ఎలా ఉంటుందో అని ప్రేక్షకులలో సందేహాలు మొదలయ్యాయి. ప్రేక్షకులు పార్ట్ 2 కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు .ఇదిలా ఉంటే ఈ ఏడాది హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మ ఇంతకుముందే తన డ్రీం ప్రాజెక్ట్ గా మహాభారతం తీయాలని ఉందని చెప్పుకొచ్చాడు. జై హనుమాన్ తో బిజీ గా వున్న ప్రశాంత్ వర్మ తప్పకుండా మహాభారతం లోని ఏదైనా ఒక కథని సినిమాగా తీసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.. ఇక బాహుబలితో సంచలనాలు సృష్టించిన దర్శకధీరుడు రాజమౌళి కూడా తన డ్రీం ప్రాజెక్ట్ గా మహాభారతం తీస్తానని ప్పుడో చెప్పారు. ప్రెసెంట్ జనరేషన్ కు తగ్గట్టు గా అలాంటి కథను ఎలా చెప్పాలో ఇప్పటికే ప్లాన్ రూపొందించినట్లు గతంలో రాజమౌళి తెలిపారు. మరి రాజమౌళి తీయబోయే మహాభారతం ఎన్నాళ్లకు తెరకెక్కుతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: