ప్రెసెంట్ ఏ చోట చూసినా కల్కి ఊసే వినిపిస్తుంది. రిలీజ్ అయి మూడు రోజులు అవుతున్నప్పటికీ ఇంకా కల్కి పేరే మారమవుతుంది. 2024లో ఇంతలాగా ఏ సినిమా ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేయలేదు. కానీ డార్లింగ్ ఎప్పుడైతే రంగంలోకి దిగాడు అప్పటినుంచి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వేరే స్థాయికి వెళ్ళిపోయింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా అండ్ దీపికా పదుకొనే మరియు దిశా పటాన్ని వంటి స్టార్స్ నటించిన ఈ సినిమా జూన్ 27వ తారీకున గ్రాండ్గా థియేటర్లలో విడుదలైంది.

ఇక ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది ఈ మూవీ. ప్రస్తుతం క్రేజీ రికార్డ్స్ను నెలకొల్పుతుంది. ఇక ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, అమితాబచ్చన్, కమల్ హాసన్ వంటి ఎంతోమంది స్టార్స్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో కొంతమంది నటీనటులు కొద్దిసేపటి పాటు కనిపించి ఇట్టే మాయమైపోయారు. ఇక ఇదిలా ఉంటే ప్రెసెంట్ సోషల్ మీడియా హడావిడి ఏ విధంగా పెరిగిపోయిందో మనందరికీ తెలిసిందే.

ఒక సినిమాలో ఒక పాత్రని ఇంకో హీరోయిన్ కి డెడికేట్ చేస్తూ వి ఎఫెక్ట్ ద్వారా వారి ప్లేస్ లో ఆ హీరోయిన్ ని సెట్ చేసి అందుకు సంబంధించిన ఫోటోలను మరియు వీడియోలని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఇక తాజాగా కూడా ఇదే జరిగింది. కల్కి సినిమాలో కృతి శెట్టి లేకపోయినప్పటికీ ఆమె రూపాన్ని మార్ఫింగ్ చేస్తూ ఒక క్యారెక్టర్ ప్లేస్ లో పెట్టారు. దీపికా పదుకొనే నీ కాపాడే అమ్మాయి పాత్రలో కృతి శెట్టి ఉంటే బాగుండు అని భావించిన ఆమె ఫ్యాన్స్ ఈ వీడియోని తయారు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: